Stock Market Closing 15 May 2023: 


స్టాక్‌ మార్కెట్లు సోమవారం చక్కగా ర్యాలీ అయ్యాయి. లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 84 పాయింట్లు పెరిగి 18,398 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 317 పాయింట్లు ఎగిసి 62,345 వద్ద ముగిశాయి. డీఎల్‌ఎఫ్ తిరుగులేని ఫలితాలు వెల్లడించడంతో రియాల్టీ సూచీ ఏకంగా 4 శాతం ఎగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు బలహీనపడి 82.30 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 62,027 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,157 వద్ద మొదలైంది. 61,950 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,562 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 317 పాయింట్ల లాభంతో 62,345 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 18,314 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,339 వద్ద ఓపెనైంది. 18,287 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,458 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 84 పాయింట్లు పెరిగి 18,398 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,821 వద్ద మొదలైంది. 43,666 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,151 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.  సాయంత్రానికి 278 పాయింట్లు ఎగిసి 44,072 వద్ద క్లోజైంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటో, టాటా మోటార్స్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, సిప్లా, బీపీసీఎల్‌, గ్రాసిమ్‌, దివిస్‌ ల్యాబ్‌ నష్టపోయాయి.  అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, రియాల్టీ సూచీలు భారీగా లాభపడ్డాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.61,800గా ఉంది. కిలో వెండి రూ.74,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 పెరిగి రూ.27,839 వద్ద ఉంది.


Also Read: మీ డబ్బు పొరపాటున వేరే నంబర్‌కు వెళ్లిందా? గాభరా పడొద్దు, తిరిగి వస్తుంది


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.