By: ABP Desam | Updated at : 15 Dec 2022 03:49 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 15 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు గురువారం హడలెత్తించాయి. అమెరికా ఫెడ్ మళ్లీ వడ్డీరేట్లు పెంచడంతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. పానిక్ సెల్లింగ్‌కు పాల్పడ్డారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 245 పాయింట్ల నష్టంతో 18,414 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 878 పాయింట్ల నష్టంతో 61,799 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 31 పైసలు బలహీనపడి 82.76 వద్ద స్థిరపడింది. ఈ ఒక్క రోజే మదుపర్లు రూ.4 లక్షల కోట్ల సంపద నష్టపోయారు.
BSE Sensex
క్రితం సెషన్లో 62,677 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,530 వద్ద మొదలైంది. 61,715 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,624 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 878 పాయింట్ల నష్టంతో 61,799 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 18,660 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,614 వద్ద ఓపెనైంది. 18,387 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,652 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 245 పాయింట్ల నష్టంతో 18,414 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీగా పతనమైంది. ఉదయం 43,940 వద్ద మొదలైంది. 43,397 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,120 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 550 పాయింట్లు పతనమై 43,498 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 45 నష్టాల్లో ముగిశాయి. బ్రిటానియా, హీరో మోటో, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ లైఫ్, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టైటాన్, ఇన్ఫీ, గ్రాసిమ్, ఐచర్ మోటార్స్ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ రంగాల సూచీలు ఒక శాతానికి పైగా పతనమయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు