Stock Market Closing 14 July 2023:


స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం దూసుకెళ్లాయి. సరికొత్త గరిష్ఠాలు నమోదు చేశాయి. ఉదయం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 150 పాయింట్లు పెరిగి 19,564 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 502 పాయింట్లు పెరిగి 65,060 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 82.17 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,558 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,775 వద్ద మొదలైంది. 65,610 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,159 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 502 పాయింట్ల లాభంతో 66,060 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


గురువారం 19,413 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,493 వద్ద ఓపెనైంది. 19,433 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,595 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 150 పాయింట్లు పెరిగి 19,564 వద్ద ముగిసింది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,860 వద్ద మొదలైంది. 44,547 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,923 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 154 పాయింట్లు పెరిగి 44,819 వద్ద క్లోజైంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్‌, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా, ఎల్‌టీఐఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్డీఎఫ్‌సీ లైఫ్, పవర్‌ గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఐటీ, మీడియా,  మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎక్కువ పెరిగాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేం లేవు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,000గా ఉంది. కిలో వెండి రూ.1500 పెరిగి రూ.77,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.420 పెరిగి రూ.25,610 వద్ద ఉంది.


Also Read:  లాభం, ఆదాయం రెండూ మిస్‌ మ్యాచింగ్‌ - విప్రో ప్రాఫిట్‌ ₹2,870 కోట్లు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial