search
×

Stock Market Today: WPI డేటాతో మార్కెట్లో జోష్‌! మరోవైపు ఫెడ్‌ భయం - లాభపడ్డ సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing 14 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం మోస్తరుగా లాభపడ్డాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడంలో కొన్ని రంగాల్లో కొనుగోళ్ల జోష్‌ కనిపించింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 14 December 2022:

భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం మోస్తరుగా లాభపడ్డాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడంలో కొన్ని రంగాల్లో కొనుగోళ్ల జోష్‌ కనిపించింది. అమెరికా ఫెడ్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందోనని మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 52 పాయింట్ల లాభంతో 18,660 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 144 పాయింట్ల లాభంతో 62,677 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 35 పైసలు బలపడి 82.45 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 62,533 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,685 వద్ద మొదలైంది. 62,591 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,835 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 144 పాయింట్ల లాభంతో 62,677 వద్ద ముగిసింది.

NSE Nifty

మంగళవారం 18,696 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,671 వద్ద ఓపెనైంది. 18,632 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,696 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 52 పాయింట్ల లాభంతో 18,660 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,078 వద్ద మొదలైంది. 43,987 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,151 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 102 పాయింట్లు ఎగిసి 44,049 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ముగిశాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఐటీ, మీడియా, మెటల్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌  ఒక శాతానికి పైగా ఎగిశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 14 Dec 2022 03:55 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Monthly Income: మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌

Monthly Income: మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌

Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది

Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది

Mutual Fund SIPs: 'సిప్‌' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు

Mutual Fund SIPs: 'సిప్‌' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు

Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్‌ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్‌ వచ్చాయి, సిప్‌ చేసిన మ్యాజిక్‌ ఇది

Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్‌ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్‌ వచ్చాయి, సిప్‌ చేసిన మ్యాజిక్‌ ఇది

టాప్ స్టోరీస్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!