Stock Market Closing 13 July 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పైపైకి ఎగిశాయి. ఆఖర్లో లాభాల స్వీకరణకు పాల్పడటంతో తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 29 పాయింట్లు పెరిగి 19,413 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 164 పాయింట్లు పెరిగి 65,558 వద్ద ముగిశాయి. నేడు ఐటీ షేర్లకు డిమాండ్ కనిపించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు పెరిగి 82.07 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,393 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,393 వద్ద మొదలైంది. 65,452 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,04 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 164 పాయింట్ల లాభంతో 65,558 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 19,384 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,495 వద్ద ఓపెనైంది. 19,385 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,567 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 29 పాయింట్లు పెరిగి 19,413 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 45,009 వద్ద మొదలైంది. 44,612 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,085 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 25 పాయింట్లు పెరిగి 44,665 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్, హిందాల్కో, టెక్ మహీంద్రా, ఇన్ఫీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, యూపీఎల్, మారుతీ, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. ఫైనాన్స్, ఐటీ, మెటల్, రియాల్టీ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.60,000గా ఉంది. కిలో వెండి రూ.2000 పెరిగి రూ.75,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.25,190 వద్ద ఉంది.
Also Read: ‘చాట్‌జీపీటీ’కి పోటీగా మస్క్ మామ కొత్త కంపెనీ, పేరు xAI
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial