Stock Market Closing 13 February 2023: 


స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు పతనమయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అదానీ గ్రూప్‌ షేర్ల పతనంతో మార్కెట్‌ అస్థిరంగా కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 85 పాయింట్ల నష్టంతో 17,770 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 250 పాయింట్ల నష్టంతో 60,431 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.56 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 60,682 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,652 వద్ద మొదలైంది. 60,245 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,740 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 250 పాయింట్ల నష్టంతో 60,431 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 17,856 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,859 వద్ద ఓపెనైంది. 17,719 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,880 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 85 పాయింట్ల నష్టంతో 17,770 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 41,563 వద్ద మొదలైంది. 41,157 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,662 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 277 పాయింట్లు తగ్గి 41,282 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 34 నష్టపోయాయి. టైటాన్‌, ఎల్‌టీ, బజాజ్‌ ఆటో, ఐచర్‌ మోటార్స్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్‌ నష్టపోయాయి.  ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి. 


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.150 తగ్గి రూ.57,230గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.70,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.25,000 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.