Stock Market Closing 12 January 2023: 


భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 37 పాయింట్ల నష్టంతో 17,858 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 147 పాయింట్ల నష్టంతో 59,958 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలహీనపడి 81.55 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 60,105 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,083 వద్ద మొదలైంది. 59,632 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,290 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 147 పాయింట్ల నష్టంతో 59,958 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 17,895 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,920 వద్ద ఓపెనైంది. 17,761 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,945 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 37 పాయింట్ల నష్టంతో 17,858 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 42,238 వద్ద మొదలైంది. 41,742 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,343 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 150 పాయింట్లు తగ్గి 42,082 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ లైఫ్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభపడ్డాయి. దివిస్‌ ల్యాబ్‌, రిలయన్స్‌, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, మీడియా, రియాల్టీ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.