Stock Market Closing 11 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఎదురవ్వడంతో సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. సాయంత్రానికి కొన్ని రంగాల సూచీలు పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 18 పాయింట్ల నష్టంతో 17,895 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 9 పాయింట్ల నష్టంతో 60,105 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలపడి 81.57 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,115 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,134 వద్ద మొదలైంది. 59,805 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,364 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 9 పాయింట్ల నష్టంతో 60,105 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 17,914 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,924 వద్ద ఓపెనైంది. 17,824 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,824 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 18 పాయింట్ల నష్టంతో 17,895 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,071 వద్ద మొదలైంది. 41,729 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,318 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 217 పాయింట్లు పెరిగి 42,232 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్, హిందాల్కో, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సెమ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, సిప్లా, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యునీలివర్, దివిస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.