Stock Market Closing 11 April 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఇన్వెస్టర్లు షాపింగ్ మూడ్‌లో ఉన్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 98 పాయింట్లు పెరిగి 17,722 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 311 పాయింట్లు పెరిగి 60,157 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు తగ్గి 82.12 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,846 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,028 వద్ద మొదలైంది. 59,919 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,267 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 311 పాయింట్ల లాభంతో 60,157 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 17,624 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,704 వద్ద ఓపెనైంది. 17,655 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,748 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 98 పాయింట్లు పెరిగి 17,722 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 41,232 వద్ద మొదలైంది. 40,990 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,403 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 531 పాయింట్లు పెరిగి 41,366 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. కొటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఐచర్ మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్, ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు కళకళలాడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.60,760గా ఉంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.76,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.180 తగ్గి రూ.26,230 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.