search
×

Stock Market Closing: మార్జినల్‌ గెయిన్స్‌! ఐటీ, పవర్‌ రియాల్టీ, బ్యాంకు షేర్లు విలవిల!

Stock Market Closing 10 July 2023: స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం కొనుగోళ్లు చేపట్టిన మదుపర్లు ఆఖర్లో అమ్మకాలకు దిగారు.

FOLLOW US: 
Share:

Stock Market Closing 10 July 2023:

స్టాక్‌ మార్కెట్లు సోమవారం  స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం కొనుగోళ్లు చేపట్టిన మదుపర్లు ఆఖర్లో అమ్మకాలకు దిగారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 36 పాయింట్లు పెరిగి 19,368 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 110 పాయింట్లు ఎగిసి 65,390 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు పెరిగి 82.57 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,280 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,482 వద్ద మొదలైంది. 65,246 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,633 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 110 పాయింట్ల లాభంతో 65,390 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 19,331 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,400 వద్ద ఓపెనైంది. 19,327 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,435 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 36 పాయింట్లు పెరిగి 19,368 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 45,958 వద్ద మొదలైంది. 44,721 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,184 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 45 పాయింట్లు తగ్గి 44,879 వద్ద క్లోజైంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టాల్లో ఉన్నాయి. రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌ గ్రిడ్‌, టీసీఎస్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు నష్టపోయాయి. మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్‌ సూచీలు బాగా తగ్గాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.59,410గా ఉంది. కిలో వెండి రూ.73,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.24,180 వద్ద ఉంది. 

Also Read: 20 పైసలకు ఎస్‌ఎంఎస్‌, రూ.14కు కాలింగ్ రెవెన్యూ డౌన్‌! OTT వల్లే ఇదంతా!!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

Published at : 10 Jul 2023 03:41 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank Stock Market news BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

టాప్ స్టోరీస్

AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం

AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం

SpaceX Crew 10 Mission Success: నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్

SpaceX Crew 10 Mission Success: నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్

Pushpa 3 Movie: 'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్

Pushpa 3 Movie: 'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్

AR Rahman Health Update: ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్ - అసలు ఆయనకు ఏం జరిగిందంటే..?

AR Rahman Health Update: ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్ - అసలు ఆయనకు ఏం జరిగిందంటే..?