Stock Market Closing 09 November 2022: స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలే వచ్చాయి. సూచీలు కీలక స్థాయిల్లో ఉండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకు షేర్లకు గిరాకీ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 45 పాయింట్ల నష్టంతో 18,157 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 151 పాయింట్ల నష్టంతో 61,033 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 46 పైసలు బలపడి 81.45 వద్ద ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 61,185 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,304 వద్ద మొదలైంది. 60,905 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,447 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 151 పాయింట్ల నష్టంతో 61,033 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 18,202 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,288 వద్ద ఓపెనైంది. 18,117 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,296 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 45 పాయింట్ల నష్టంతో 18,157 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 41,914 వద్ద మొదలైంది. 41,667 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,948 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 96 పాయింట్ల లాభంతో 41,783 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, ఐటీసీ, హీరో మోటో, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, దివిస్‌ ల్యాబ్‌, పవర్‌ గ్రిడ్‌, గ్రాసిమ్‌, శ్రీ సెమ్‌ నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ సూచీ అత్యధికంగా 3.39 శాతం లాభపడగా రియాల్టీ 1.37 శాతం పతనమైంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.