Stock Market Closing 09 January 2023: 


భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లు ఆర్జించారు. ప్రాఫిట్‌ బుకింగ్‌ జరగడంతో ఇంట్రాడే గరిష్ఠాలకు చేరిన సూచీలు కాస్త తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 241 పాయింట్ల లాభంతో 18,101  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 846 పాయింట్ల లాభంతో 60,747 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 36 పైసలు బలపడి 82.36 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 59,900 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,147 వద్ద మొదలైంది. 60,109 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,889 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి  846 పాయింట్ల లాభంతో 60,747 వద్ద ముగిసింది.


NSE Nifty


శుక్రవారం 17,859 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,952 వద్ద ఓపెనైంది. 17,936 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,141 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 241 పాయింట్ల లాభంతో 18,101 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,404 వద్ద మొదలైంది. 42,186 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,716 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 393 పాయింట్లు పెరిగి 42,582 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో క్లోజయ్యాయి. ఎం అండ్‌ ఎం, ఎస్‌బీఐ లైఫ్‌, ఇండస్‌ ఇండ్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, గ్రాసిమ్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు నష్టపోయాయి. కన్జూమర్‌ డ్యురబుల్స్‌ మినహా అన్ని సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ సూచీలు గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.