Stock Market Closing 09 February 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అదానీ గ్రూప్ షేర్ల వెయిటేజీపై ఎంఎస్‌సీఐ సమీక్షిస్తామని చెప్పడం మార్కెట్ సెంటిమెంటును నెగెటివ్‌గా మార్చింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 8 పాయింట్ల లాభంతో 17,879 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 43 పాయింట్ల లాభంతో 60,707 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,663 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,715 వద్ద మొదలైంది. 60,472 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,725 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 43 పాయింట్ల లాభంతో 60,707 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,871 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,885 వద్ద ఓపెనైంది. 17,799 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,887 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 8 పాయింట్ల లాభంతో 17,879 వద్ద చలిస్తోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప నష్టాల్లో ఉంది. ఉదయం 41,634 వద్ద మొదలైంది. 41,252 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,634 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 126 పాయింట్లు తగ్గి 41,411 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరోమోటో కార్ప్, టాటా మోటార్స్, యూపీఎల్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. మీడియా షేర్లకు గిరాకీ ఉంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ విల్మార్: 2022 డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కాలానికి అదానీ విల్మార్ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 16% పెరిగి రూ. 246 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7% పెరిగి రూ. 15,438 కోట్లుగా నమోదైంది.
శ్రీ సిమెంట్: డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత పన్ను తర్వాతి లాభం (PAT) రూ. 277 కోట్లకు చేరింది, గత సంవత్సరం ఇదే కాలం కంటే 44% క్షీణించింది. ఈ కంపెనీ, ఒక్కో షేరుకు రూ. 45 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది.
LIC: ఇన్సూరెన్స్ బెహెమోత్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) తన మూడవ త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించనుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.