Stock Market Closing 06 June 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. ఉదయం నుంచీ నష్టాల్లో కొనసాగిన సూచీలు ఆఖర్లో టర్న్ అరౌండ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 5 పాయింట్లు పెరిగి 18,599 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 5 పాయింట్లు పెరిగి 62,792 వద్ద క్లోజయ్యాయి. ఐటీ ఇండెక్స్ రక్తమోడింది! డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు బలపడి 82.61 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,787 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,738 వద్ద మొదలైంది. 62,554 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,867 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 5 పాయింట్ల లాభంతో 62,792 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 18,593 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,600 వద్ద ఓపెనైంది. 18,531 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,622 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 5 పాయింట్లు ఎగిసి 18,599 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,156 వద్ద మొదలైంది. 44,009 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,236 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 62 పాయింట్లు పెరిగి 44,164 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 28 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సెమ్, గ్రాసిమ్, దివిస్ ల్యాబ్, కొటక్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫీ, టీసీఎస్, విప్రో, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి రూ.60,650గా ఉంది. కిలో వెండి రూ.500 ఎగిసి రూ.73,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.27,470 వద్ద ఉంది.
Also Read: రోజుకు ₹45 పెట్టుబడితో ₹25 లక్షలు మీ సొంతం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.