Stock Market Closing 02 March 2023: 


స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. యూఎస్‌ ఫెడ్‌ రేట్ల పెంపు వార్తలు ఆందోళనకు గురిచేశాయి. రియాల్టీ మినహా అన్ని రంగాల షేర్లను మదుపర్లు తెగనమ్మారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 129 పాయింట్లు తగ్గి 17,321 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 501 పాయింట్లు తగ్గి 58,909 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలపడి 82.59 వద్ద స్థిరపడింది. అదానీ గ్రూప్‌ షేర్లు ఎగిశాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 59,411 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,287 వద్ద మొదలైంది. 58,866 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,423 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 501 పాయింట్ల నష్టంతో 58,909 వద్ద ముగిసింది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 17,380 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,421 వద్ద ఓపెనైంది. 17,306 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,445 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 129 పాయింట్లు తగ్గి 17,321 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 40,604 వద్ద మొదలైంది. 40,312 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,773 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 308 పాయింట్లు తగ్గి 40,389 వద్ద ముగిసింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హీరోమోటో షేర్లు లాభపడ్డాయి. మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ షేర్లు నష్టపోయాయి. రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. ఆటో, బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.170 పెరిగి రూ.56,290 గా ఉంది. కిలో వెండి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.25,410 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.