Stock Market Closing 01 March 2023: 


స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఎనిమిది రోజులు వరుస నష్టాలకు తెరపడింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. జీడీపీ గణాంకాలు విడుదల అవ్వడం, తయారీ రంగం స్థిరంగా ఉండటం మదుపర్లలో పాజిటివ్‌ సెంటిమెంటు పెంచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 146 పాయింట్లు పెరిగి 17,450 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 448 పాయింట్లు ఎగిసి 59,411 వద్ద ముగిశాయి. అదానీ షేర్లు దూకుడు ప్రదర్శించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు లాభపడి 82.50 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 58,926 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,136 వద్ద మొదలైంది. 59,109 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,475 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 448 పాయింట్ల లాభంతో 59,411 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 17,303 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,360 వద్ద ఓపెనైంది. 17,345 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,467 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 146 పాయింట్లు పెరిగి 17,450 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ భారీగా లాభపడింది. ఉదయం 40,473 వద్ద మొదలైంది. 40,341 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,725 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 429 పాయింట్లు పెరిగి 40,698 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 45 కంపెనీలు లాభాల్లో 5 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హిందాల్కో, యూపీఎల్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ షేర్లు లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, బ్రిటానియా, సిప్లా, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు భారీగా లాభపడ్డాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.170 పెరిగి రూ.56,290 గా ఉంది. కిలో వెండి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.25,410 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.