Stock Market @12 PM, 30 May 2023: 


స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు ఆల్‌టైమ్‌ హై దిశగా సాగే క్రమంలో చిన్న పుల్‌బ్యాక్‌ కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 13 పాయింట్లు పెరిగి 18,612 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 27 పాయింట్లు ఎగిసి 62,873 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 62,846 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,839 వద్ద మొదలైంది. 62,737 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,030 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 27 పాయింట్ల లాభంతో 62,873 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 18,598 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,606 వద్ద ఓపెనైంది. 18,575 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,662 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 13 పాయింట్లు పెరిగి 18,612 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 44,277 వద్ద మొదలైంది. 44,207 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,415 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 15 పాయింట్లు తగ్గి 44,296 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. ఐటీసీ, అపోలో హాస్పిటల్స్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ నష్టపోయాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు ఎక్కువ నష్టాల్లో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా ఎక్కువ పెరిగాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50 తగ్గి రూ.60,550గా ఉంది. కిలో వెండి  రూ.77000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.27,240 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.