By: ABP Desam | Updated at : 27 Dec 2022 12:21 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Photo by Burak The Weekender )
Stock Market @ 12 PM 27 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. కొనుగోళ్ల విషయంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 39 పాయింట్ల లాభంతో 18,054 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 136 పాయింట్ల లాభంతో 60,671 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 60,556 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,861 వద్ద మొదలైంది. 60,405 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,970 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 136 పాయింట్ల లాభంతో 60,671 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
సోమవారం 18,1014 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,089 వద్ద ఓపెనైంది. 17,967 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,134 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 39 పాయింట్ల లాభంతో 18,054 వద్ద చలిస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప నష్టాల్లో ఉంది. ఉదయం 42,827 వద్ద మొదలైంది. 42,394 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,919 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 66 పాయింట్లు పతనమై 42,563 వద్ద ఉంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. హిందుస్థాన్ యునీలివర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్ రంగాల సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెటల్, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం