Stock Market @12 PM, 06 April 2023: 


స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. రెపోరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం మదుపర్లలో పాజిటివ్‌ సెంటిమెంటు నింపింది. అదానీ షేర్లూ దూకుడు మీదుండటంతో సూచీలు పైపైకి వెళ్తున్నాయి. మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 48 పాయింట్లు పెరిగి 17,604 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 145 పాయింట్లు పెరిగి 59,837 వద్ద కొనసాగుతున్నాయి. 


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 59,689  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,627 వద్ద మొదలైంది. 59,520 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,925 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 145 పాయింట్ల లాభంతో 59,837 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 17,557 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,533 వద్ద ఓపెనైంది. 17,502 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,621 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 48 పాయింట్లు పెరిగి 17,604 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 40,940 వద్ద మొదలైంది. 40,820 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,274 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 105 పాయింట్లు పెరిగి 41,104 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఫైనాన్స్‌, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.60,980 గా ఉంది. కిలో వెండి రూ.600 తగ్గి రూ.76,490 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.640 తగ్గి రూ.26,330 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.