Stock Market at 12 PM, 04 September 2023: 


స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా, గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. సెప్టెంబర్‌ డెరివేటివ్స్‌ సిరీస్‌ మొదలవ్వడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల జోష్‌లో ఉన్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 45 పాయింట్లు పెరిగి 19,481 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 95 పాయింట్లు పెరిగి 65,482 వద్ద కొనసాగుతున్నాయి. జియో ఫిన్‌ మళ్లీ లిస్టింగ్‌ ధరకు చేరుకుంది. ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లు తగ్గాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,387 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,525 వద్ద మొదలైంది. 65,285 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,630 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 95 పాయింట్ల లాభంతో 65,482 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 19,435 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,525 వద్ద ఓపెనైంది. 19,432 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,526 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 45 పాయింట్లు పెరిగి 19,481 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ఉదయం 44,647 వద్ద మొదలైంది. 44,310 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,656 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 3 పాయింట్ల నష్టంతో 44,433 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. జియోఫిన్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, హిందాల్కో షేర్లు ఎగిశాయి. ఎం అండ్‌ ఎం, నెస్లే ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఏసియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎక్కువ పెరిగాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.60,320 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.76,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.25,600 వద్ద ఉంది.


Also Read: షూరిటీ లేకుండా లోన్‌, పైగా వడ్డీ తక్కువ - ఎల్‌ఐసీ పాలసీ ఉంటే చాలు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.