Stock Market Closing Bell 16 August 2022: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలే అందడం, క్రూడాయిల్ ధర తగ్గడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 127 పాయింట్ల లాభంతో 17,825 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 379 పాయింట్ల లాభంతో 59,842 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 79.82గా ఉంది.
BSE Sensex
క్రితం సెషన్లో 59,462 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,675 వద్ద మొదలైంది. 59,673 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,923 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 379 పాయింట్ల లాభంతో 59,842 వద్ద ముగిసింది.
NSE Nifty
శుక్రవారం 17,698 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,797 వద్ద ఓపెనైంది. 17,764 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,839 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 127 పాయింట్ల లాభంతో 17,825 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 39,284 వద్ద మొదలైంది. 39,119 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,444 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 197 పాయింట్ల లాభంతో 39,239 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభాల్లో 8 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్స్, బీపీసీఎల్, మారుతీ షేర్లు లాభాపడ్డాయి. గ్రాసిమ్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ నష్టాల్లో ముగిశాయి. మీడియా మినహా మిగతా రంగాల సూచీలు ఎగిశాయి. రియాల్టీ, ఆటో 2 శాతం వరకు లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లకు గిరాకీ కనిపించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.