search
×

Stock Market News: పటాపంచలైన భయం! స్టాక్‌మార్కెట్లో కొనుగోళ్ల సందడి - 19500 పైనే నిఫ్టీ!

Stock Market @12 PM, 04 August 2023: రెండు రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్‌ఐఐలు మళ్లీ కొనుగోళ్లు మొదలు పెట్టాడు.

FOLLOW US: 
Share:

Stock Market @12 PM, 04 August 2023:

రెండు రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్‌ఐఐలు మళ్లీ కొనుగోళ్లు మొదలు పెట్టాడు. బెంచ్‌మార్క్‌ సూచీలకు కీలక స్థాయిల్లో సపోర్ట్‌ లభించింది. ఉదయం నుంచే ఇన్వెస్టర్లు యాక్టివ్‌గా బయింగ్‌ చేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 133 పాయింట్లు పెరిగి 19,515 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 462 పాయింట్లు పెరిగి 65,702 వద్ద కొనసాగుతున్నాయి. జొమాటో, డిక్సన్‌ టెక్నాలజీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యాక్టివ్‌గా ఉన్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,240 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,453 వద్ద మొదలైంది. 65,387 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,744 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 462 పాయింట్ల లాభంతో 65,702 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 19,381 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,462 వద్ద ఓపెనైంది. 19,436 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,523 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 133 పాయింట్లు పెరిగి 19,515 వద్ద కొనసాగుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,754 వద్ద మొదలైంది. 44,520 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,072 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 533 పాయింట్లు పెరిగి 45,046 వద్ద ట్రేడవుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. సిప్లా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, విప్రో షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఆటో, బీపీసీఎల్‌, సన్ ఫార్మా, పవర్‌ గ్రిడ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టపోయాయి. మీడియా, హెల్త్‌కేర్‌ మినహా అన్ని రంగాల ఊచీలు పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు కళకళలాడుతున్నాయి. 

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.59,950 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2300 తగ్గి రూ.75000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.24,420 వద్ద కొనసాగుతోంది.

Also Read: మీకు రూ.15,490 రీఫండ్‌ వస్తోంది! ఆ మెసేజ్‌ అస్సలు తెరవొద్దని ఐటీ శాఖ వార్నింగ్‌!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 04 Aug 2023 11:56 AM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank Stock Market news BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

టాప్ స్టోరీస్

Shock for YCP: వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !

Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ

Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ

TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?

TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?

Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?

Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?