Year Ender 2023 Top 10 Hybrid Mutual Fund: మన పెట్టుబడిలో ఎప్పుడూ వైవిధ్యం ఉండాలి. మొత్తం డబ్బంతా ఒకే అసెట్‌ క్లాస్‌లో పెడితే రిస్క్‌ ‍‌(Risk in Investment) ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా, విభిన్న రకాల పెట్టుబడుల్లోకి డబ్బును డైవర్ట్‌ చేస్తే రిస్క్‌ చాలా వరకు తగ్గుతుంది. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్‌ కూడా చూడవచ్చు. 


ఒకే పెట్టుబడిపై డైవర్సిఫికేషన్ బెనిఫిట్స్‌ (Diversification benefits) అందించే హైబ్రిడ్ ఫండ్స్‌కు 2023 సంవత్సరం చాలా బాగుంది. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌ అంటే.. ఇవి ఈక్విటీతో పాటు డెట్‌లోనూ పెట్టుబడి ‍‌(Investment in Equity and Debt) పెడతాయి. పెట్టుబడిదార్ల డబ్బు ఇటు ఈక్విటీ మార్కెట్‌లోకి, అటు బాండ్‌ మార్కెట్‌లోకి వెళ్తుంది. ఎటూ పరిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా నిలబడడానికి పెట్టుబడిదార్లకు ఇది సాయపడుతుంది.


బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ను దాటిన హైబ్రిడ్‌ ఫండ్స్‌
2023 క్యాలెండర్‌ సంవత్సరంలో ఇప్పటి వరకు, డజన్ల కొద్దీ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌ BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ కంటే మెరుగ్గా పని చేశాయి. అత్యుత్తమ హైబ్రిడ్ ఫండ్, 2023లో ఇప్పటి వరకు, 33% వరకు రిటర్న్స్‌ ఇచ్చింది. ఈ కాలంలో, 10కి పైగా హైబ్రిడ్ ఫండ్స్‌ రాబడులు 20 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి.


హైబ్రిడ్ మ్యూచువల్‌ ఫండ్స్‌లో రకాలు (Types of Hybrid Mutual Funds)
ప్రస్తుతం, మార్కెట్‌లో చాలా రకాల హైబ్రిడ్ మ్యూచువల్‌ ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ, తమ నిధులను ఈక్విటీలో, డెట్‌లో వివిధ నిష్పత్తుల్లో కేటాయిస్తాయి. నిధుల కేటాయింపు నిష్పత్తిని బట్టి వాటి కేటగిరీని నిర్ణయిస్తారు. 


హైబ్రిడ్ ఫండ్స్ ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. అగ్రెసివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ (Aggressive Hybrid Mutual Funds), కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ (Conservative Hybrid Mutual Funds). 


ఫండ్ కేటాయింపులను బట్టి ఈక్విటీ సేవింగ్ హైబ్రిడ్ ఫండ్ మూడో రకం కిందకు వస్తుంది. సొల్యూషన్ ప్రకారం, డైనమిక్ అసెట్ అలోకేషన్, మల్టీ అసెట్ అలొకేషన్, రిటైర్మెంట్ సొల్యూషన్ ఉన్నాయి. ఇవి కాకుండా, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌, హైబ్రిడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ గురించి కూడా చెప్పుకోవచ్చు.


2023లో టాప్‌-10 అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ (ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రిటర్న్స్):


బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ అండ్‌ స్మాల్ క్యాప్ ఈక్విటీ అండ్‌ డెట్ ఫండ్ -- 32.64%
JM అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ -- 31.89%
ICICI ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్‌ డెట్ ఫండ్ -- 25.02%
ఎడెల్వీస్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ -- 24.00%
DSP ఈక్విటీ అండ్‌ బాండ్ ఫండ్ -- 23.30%
UTI అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ -- 22.27%
HSBC అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ -- 21.87%
ఇన్వెస్కో ఇండియా ఈక్విటీ అండ్‌ బాండ్ ఫండ్ -- 21.71%
నిప్పాన్ ఇండియా ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ -- 21.48%
మహీంద్రా మ్యానులైఫ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ -- 21.29%


2023లో టాప్‌-10 కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ (ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రిటర్న్స్):


మోతీలాల్ ఓస్వాల్ అసెట్ అలొకేషన్‌ పాసివ్‌ ఫండ్ -- 13.47%
కోటక్ డెట్ హైబ్రిడ్ ఫండ్ -- 13.42%
HDFC హైబ్రిడ్ డెట్ ఫండ్ -- 12.92%
పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ -- 12.67%
DSP రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ -- 11.52%
బరోడా BNP పరిబాస్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ -- 11.27%
SBI కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ -- 11.16%
HSBC కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ -- 10.95%
ICICI ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ -- 10.94%
ఫ్రాంక్లిన్ ఇండియా డెట్ హైబ్రిడ్ ఫండ్ -- 10.53%


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం:ఆధార్‌ విషయంలో కేంద్రం సీరియస్‌, రూ.50 వేలు ఫైన్‌ కట్టిస్తామని వార్నింగ్‌