Best Small Cap Funds: నెల రోజుల నీరసం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ ర్యాలీ బాట పట్టాయి. గత నెలలో (జూన్‌) దేశీయ మార్కెట్లు దున్నేశాయి. హెడ్‌లైన్‌ ఇండీస్‌ కొత్త ఆల్-టైమ్ గరిష్టాలను స్కేల్ చేసి, జూన్‌ నెల చివరి ట్రేడింగ్ రోజును (జూన్ 30) ముగించాయి. ఈ నెల తొలి ట్రేడింగ్‌ రోజును (సోమవారం) కూడా లైఫ్‌ టైమ్‌ హైతో స్టార్ట్‌ చేశాయి.


ఒక్క ఏడాదిలో 22 శాతం గెయిన్స్‌
గత ఒక ఏడాది కాలంలో BSE సెన్సెక్స్ 22 శాతానికి పైగా లాభపడింది. అదే కాలంలో నిఫ్టీ కూడా దాదాపు 22 శాతం లాభపడింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) రెండు ప్రధాన సూచీలు దాదాపు 6 శాతం జంప్‌ చేశాయి. ఒక్క జూన్ నెలలోనే తలో 4 శాతం ర్యాలీ చేశాయి. బ్రాడర్‌ మార్కెట్‌తో (మొత్తం మార్కెట్‌) పోలిస్తే, కొన్ని మ్యూచువల్ ఫండ్‌ స్కీమ్‌లు ఇంకా మెరుగ్గా పెర్ఫార్మ్‌ చేశాయి.


మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ ఉపయోగపడతాయి
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి మార్గం. వీటిలో రిస్క్‌ తక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్‌ బదులు ఫండ్ మేనేజర్‌ పని చేస్తాడు, సాధ్యమైనంత ఎక్కువ లాభాలు పొందడానికి ప్రయత్నిస్తాడు. మార్కెట్‌ను నిరంతరం ట్రాక్ చేసే నిపుణుల సైన్యం ఫండ్‌ హౌస్‌ల దగ్గర ఉంటుంది. స్టాక్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడం, నిరంతరం ట్రాక్ చేస్తూ, మార్కెట్‌కు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటెజీలు మార్చడం సామాన్య పెట్టుబడిదార్లకు అన్ని వేళలా సాధ్యం కాదు. కాబట్టే, స్టాక్ మార్కెట్ ర్యాలీని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజలు మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతారు. 


గత ఏడాది కాలంలో, బ్రాడర్‌ మార్కెట్‌ను భారీ మార్జిన్‌తో ఓడించడమే కాకుండా, ఇన్వెస్టర్లకు 45% వరకు రాబడి అందించిన 10 స్మాల్ క్యాప్ ఫండ్స్‌ ఉన్నాయి. అవి, డైరెక్ట్‌ + గ్రోత్‌ ప్లాన్స్‌. కాబట్టి, ఇన్వెస్టర్ల పెట్టుబడి వ్యయం కూడా వీటిలో చాలా తక్కువ.


10 బెస్ట్‌ స్మాల్ క్యాప్ మ్యూచువల్‌ ఫండ్స్‌:


పథకం పేరు                                                          1 సంవత్సర కాలంలో రిటర్న్స్
HDFC Small Cap Fund - డైరెక్ట్‌ ప్లాన్‌ - గ్రోత్‌              45.56%
Quant Small Cap Fund - డైరెక్ట్‌ ప్లాన్‌ - గ్రోత్‌              41.06%
Franklin India Smaller Companies Fund - డైరెక్ట్‌ ప్లాన్‌ - గ్రోత్‌ 40.75%
Nippon India Small Cap Fund - డైరెక్ట్‌ ప్లాన్‌ - గ్రోత్‌    39.47%
Tata Small Cap Fund - డైరెక్ట్‌ ప్లాన్‌ - గ్రోత్‌                  39.41%
ITI Small Cap Fund - డైరెక్ట్‌ ప్లాన్‌ - గ్రోత్‌                     35.60%
HSBC Small Cap Fund - డైరెక్ట్‌ ప్లాన్‌ - గ్రోత్‌                34.29%
Invesco India Smallcap Fund - డైరెక్ట్‌ ప్లాన్‌ - గ్రోత్‌     33.92%
Edelweiss Small Cap Fund - డైరెక్ట్‌ ప్లాన్‌ - గ్రోత్‌         33.40%
Sundaram Small Cap Fund - డైరెక్ట్‌ ప్లాన్‌ - గ్రోత్‌        33.21%


మరో ఆసక్తికర కథనం: ఈ వారం డబ్బు సంపాదించే స్టాక్స్‌ - లిస్ట్‌లో 3 అదానీ కంపెనీలు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial