By: ABP Desam | Updated at : 14 Oct 2022 01:05 PM (IST)
Edited By: Arunmali
మ్యూచువల్ ఫండ్స్ కొన్న, వదిలించుకున్న స్టాక్స్
Mutual Funds: జూన్ నెల నుంచి నిఫ్టీ 19% భారీ ర్యాలీ చేయడంతో, స్టాక్స్ కొనుగోలు సమయంలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు జాగ్రత్తగా అడుగులు వేశారు. ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, RBI, అమెరికన్ ఫెడ్ రేట్లలో నిరంతర పెంపుదలల నేపథ్యంలో.. ఆటో, రిటైల్, హోటల్స్, లీజర్, లగ్జరీ గూడ్స్ వంటి థీమ్స్ మీద సెప్టెంబర్‌లో పందేలు వేశారు.
పండుగ సీజన్‌తో పాటు; ప్రయాణీకుల రద్దీ పెరగడం, బంగారం కొనుగోళ్లు, క్రెడిట్ డిమాండ్ పెరగడం వంటివాటి రూపంలో దేశీయ వినియోగంలో వృద్ధి కనిపిస్తోంది. కాబట్టి, కనీసం మరో రెండు త్రైమాసికాల వరకు ఈ కంపెనీలు మెరుగైన ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెంచిన, తగ్గించిన, పూర్తిగా వదిలించుకున్న, కొత్తగా కొన్న స్టాక్స్ ఇవి:
SBI MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్ : యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్
కొంతమేర అమ్మిన స్టాక్స్ : టాటా స్టీల్, చోళ ఇన్వెస్ట్‌మెంట్, బంధన్ బ్యాంక్
పూర్తిగా వదిలించుకున్నవి : క్యామ్స్, సాగర్ సిమెంట్స్, ఇండియా పెస్టిసైడ్స్
కొత్తగా కొన్న స్టాక్స్ : ఎల్‌ఐసీ హౌసింగ్, అంబుజా, సుందరం ఫైనాన్స్
ICICI Pru MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్ : హీరో, టీసీఎస్, ఇన్ఫోసిస్
కొంతమేర అమ్మిన స్టాక్స్ : ఎయిర్‌టెల్, మహీంద్రా & మహీంద్రా, టీవీఎస్
పూర్తిగా వదిలించుకున్నవి : పారాదీప్ పాస్పేట్స్, ఏబీఎస్‌ల్ ఏఎంసీ, తమిళనాడు న్యూస్‌ప్రింట్
కొత్తగా కొన్న స్టాక్స్ : కిమ్స్, డీఎల్‌ఎఫ్, పీబీ ఫిన్‌టెక్
HDFC MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్ : టెక్ మహీంద్ర, మహీంద్రా & మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్
కొంతమేర అమ్మిన స్టాక్స్ : ఐటీసీ, టీసీఎస్, భారత్ ఎలక్ట్రానిక్స్
పూర్తిగా వదిలించుకున్నవి : ఇండియన్ ఆయిల్, హెచ్‌జీ ఇన్‌ఫ్రా, జీఈ పవర్
కొత్తగా కొన్న స్టాక్స్ : బీఈఎంఎల్ ల్యాండ్ అసెట్స్
Nippon India MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్ : ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, బంధన్ బ్యాంక్‌ర్సన్
కొంతమేర అమ్మిన స్టాక్స్ : HDFC బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా
పూర్తిగా వదిలించుకున్నవి : ఎల్‌టీఐ, ఓరియంట్ హోటల్, మదర్‌సన్ సుమీ వైరింగ్
కొత్తగా కొన్న స్టాక్స్ : భెల్, మారికో, సుందరం ఫైనాన్స్
UTI MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్ : మారుతి సుజుకి, హిందాల్కో, సువెన్ ఫార్మా
కొంతమేర అమ్మిన స్టాక్స్ : బజాజ్ ఆటో, టోరెంట్ ఫార్మా, డా.రెడ్డీస్
పూర్తిగా వదిలించుకున్నవి : ఇప్కా ల్యాబ్స్, హిందుస్థాన్ జింక్, అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్
కొత్తగా కొన్న స్టాక్స్ : పీఐ ఇండస్ట్రీస్, ఏఎంఐ ఆర్గానిక్స్, ఎన్‌హెచ్‌పీసీ
Axis MF
పెట్టుబడులు పెంచిన స్టాక్స్ : ఎస్‌బీఐ, మహీంద్రా & మహీంద్రా, అపోలో హాస్పిటల్స్
కొంతమేర అమ్మిన స్టాక్స్ : బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, సంవర్ధన్ మదర్‌సన్
పూర్తిగా వదిలించుకున్నవి : ఎస్కార్ట్ కుబోటా, ఓఎన్‌జీసీ
కొత్తగా కొన్న స్టాక్స్ : జొమాటో, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేవయాని ఇంటర్నేషనల్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
Kokata Murder Case: 'నా కుమారుడికి మరణ శిక్ష విధించండి' - ఆర్జీకర్ కేసు దోషి తల్లి
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో యాత్రికుల వాహనానికి ప్రమాదం - 40 మందికి పైగా గాయాలు