By: ABP Desam | Updated at : 06 May 2022 04:49 PM (IST)
Edited By: Ramakrishna Paladi
మ్యూచువల్ ఫండ్స్
Top Multicap Funds: దీర్ఘ కాలంలో సంపద సృష్టించాలంటే మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం ఒక సులభ మార్గం! ఈ మధ్యకాలంలో మల్టీ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్టర్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మిగతా వాటితో పోలిస్తే నష్టభయం తక్కువగా ఉండటం, రాబడి ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ షేర్లలో సమానంగా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వీటిని మల్టీ క్యాప్ అంటారు. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏడాదికి సగటున 20 శాతమే రాబడి ఇస్తే మల్టీ క్యాప్ ఫండ్లు ఏకంగా 26 శాతం వరకు రిటర్న్స్ ఇస్తున్నాయి.
1. Quant Active Fund - Direct Plan
క్వాంట్ యాక్టివ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఈ విభాగంలో మంచి రాబడి ఇస్తోంది. 2013లో ఈ ఫండ్ మొదలైంది. అప్పట్నుంచి వార్షిక ప్రాతిపదికన 21.28 శాతం వరకు ఇన్వెస్టర్లకు రాబడి ఇచ్చింది. ఏడాదిలో ఈ ఫండ్ 32 శాతం రిటర్న్ ఇవ్వగా 3 ఏళ్లలో 34 శాతం, ఐదేళ్లకు 24 శాతం రాబడి ఇచ్చింది. క్వాంట్ యాక్టివ్ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ (NAV) 2022, మే 2 నాటికి రూ.446.22గా ఉంది.
2. Sundaram Equity Fund - Direct Plan
ఇదీ డైరెక్ట్ ప్లానే. ఈ మధ్య కాలంలో ఇన్వెస్టర్లకు మంచి రాబడి ఇచ్చింది. మొదలైనప్పటి నుంచీ ఏడాదికి సగటున 16.31 శాతం రిటర్న్ అందించింది. ఒక ఏడాదిలో ఈ ఫండ్ 25 శాతం రిటర్న్ ఇవ్వగా 3 ఏళ్లలో 17, ఐదేళ్లలో 13.07 శాతం రాబడి అందించింది. 2022, మే 2 నాటికి NAV ఒక యూనిట్‌కు రూ.248,94గా ఉంది.
3. Invesco India Multicap Fund - Direct Plan
ఇన్వెస్కో ఇండియా మల్టీ క్యాప్ ఫండ్‌లోనూ ఇన్వెస్టర్లు ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. మొదలైనప్పటి నుంచి సగటున ఏడాదికి 18.12 శాతం రిటర్న్ ఇచ్చింది. ఒక ఏడాదిలో 18.85 శాతం రాబడి ఇవ్వగా 3 ఏళ్లలో 18.44, ఐదేళ్లలో 12.29 శాతం రిటర్న్ అందించింది. 2022, మే 2 నాటికి నెట్ అసెట్ వాల్యూ రూ.84.64గా ఉంది.
4. ICICI Prudential Multicap Fund - Direct Plan
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ మంచి రిటర్నులనే ఇస్తోంది. ఇన్వెస్టర్ల సంపదను వృద్ధి చేస్తోంది. ఈ ఫండ్ మొదలైనప్పటి నుంచి సగటున ఏటా 15.41 శాతం రాబడి అందించింది. ఇక ఏడాదిలో ఏకంగా 21 శాతం రిటర్న్ ఇవ్వడం గమనార్హం. 3 ఏళ్లలో 14.98, ఐదేళ్లలో 12.10 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చింది. 2022, మే 2 నాటికి ఈ ఫండ్ నెట్ అసెట్స్ వాల్యూ ఒక యూనిట్‌కు రూ.471.87గా ఉంది.
5. Nippon India Multi Cap Fund - Direct Plan
నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ ఆరంభమైనప్పటి నుంచి ఏడాదికి సగటున 14.58 శాతం రాబడి ఇచ్చింది. ఒక ఏడాదిలో 33.67 శాతం, మూడేళ్లలో 16.05 శాతం, ఐదేళ్లలో 13.39 శాతం రిటర్న్ అందించింది. 2022, మే 2 నాటికి నెట్ అసెట్స్ వాల్యూ ఒక యూనిట్‌కు రూ.160.20గా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Kotak Mutual Fund: రూ.10 వేల సిప్ - 3 ఏళ్లలో రూ.5 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇది
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!
Stock Market News: అలల్లా ఎగిసి వెంటనే పడ్డ స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్ 215, నిఫ్టీ 100 డౌన్
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Top Gainer May 22, 2022 : స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!