Stock Market Opening Bell 26 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు ఇవాళ (సోమవారం) బిగ్‌ గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమయ్యాయి. అమెరికన్‌ మార్కెట్లు గత శుక్రవారం మళ్లీ భారీ నష్టాల్లో ముగిశాయి, 2022లోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరాయి. ఆసియా మార్కెట్ల నుంచి కూడా ప్రతికూల సంకేతాలు అందడంతో మన దగ్గర సెంటిమెంట్‌ తగ్గింది. 


వడ్డీ రేట్ల పెంపు విషయంలో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ (యూఎస్‌ ఫెడ్‌) ఈ నెలకు తన పాత్రను పోషించింది, ఇక రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వంతు మిగిలివుంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో (బుధ, గురు, శుక్రవారాల్లో) జరగనున్న RBI పరపతి విధాన సమీక్షలో (MPC) తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి. MPC నిర్ణయాలు బుధవారం వెల్లడవుతాయి. వడ్డీ రేట్లను RBI ఎన్ని బేసిస్‌ పాయింట్లు పెంచుతుంది, దేశంలో ద్రవ్యోల్బణం, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపు గురించి ఎలాంటి సిగ్నల్స్‌ ఇస్తుంది అన్నదానిపై ఈ వారంలో మన మార్కెట్ల కదలికలు ఆధారపడి ఉంటాయి. RBI తన వడ్డీ రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతుందని ప్రస్తుతం మార్కెట్‌ ఆశిస్తోంది. ఇంతకుమించి పెంచితే మార్కెట్లు మరింత పతనమయ్యే అవకాశం ఉంది. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా, వడ్డీ రేటు పెంపు మీద రేపు నిర్ణయం వెలువరిస్తుంది. మన ఈక్విటీల మీద దాని ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని అంచనా. అయితే, యూరోప్‌ మార్కెట్లలో కదలికల ప్రభావం ఇండియన్‌ ఈక్విటీస్‌ మీద ఉంటుంది కాబట్టి, అక్కడి వడ్డీ రేట్లను కూడా మనం కీలకంగా గమనించాలి. 


BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం) 58,098.92 పాయింట్ల  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇవాళ (సోమవారం) 574 పాయింట్లు లేదా 0.99 శాతం నష్టంతో 57,525.03 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం 10 గంటల సమయానికి, చూస్తే, గ్యాప్‌ డౌన్‌ నష్టాలు మరింత పెరిగాయి. ఆ సమయానికి సెన్సెక్స్ 1.54 శాతం లేదా 893.06 పాయింట్ల నష్టంతో 57,205.86 వద్ద ట్రేడవుతోంది.


NSE Nifty
శుక్రవారం 17,327.35 పాయింట్ల వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఇవాళ 171 పాయింట్లు లేదా 0.99 శాతం నష్టంతో 17,156.30 పాయింట్ల వద్ద ఓపెనైంది. ఉదయం 10 గంటల సమయానికి... 1.68 శాతం లేదా 290.50 పాయింట్లు పతనమై 17,036.85 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank
శుక్రవారం 39,546.25 పాయిట్ల వద్ద ముగిసిన బ్యాంక్‌ నిఫ్టీ, ఇవాళ 518 పాయింట్లు లేదా 1.31 శాతం నష్టంతో 39,027.85 పాయింట్ల వద్ద మొదలైంది. ఉదయం 10 గంటల సమయానికి... 2.17 శాతం లేదా 860.05 పాయింట్లు కోల్పోయి 38,686.20 వద్ద కొనసాగుతోంది.


Top Gainers and Lossers
మార్కెట్‌ ప్రారంభంలో... నిఫ్టీ50లో కేవలం 5 కంపెనీలు లాభాల్లో ఉండగా, మిగిలిన 45 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. నెస్టెల్‌ ఇండియా, బ్రిటానియా, ఇన్ఫీ, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ గ్రీన్‌లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, అపోలో హాస్పిటల్స్‌, మారుతి స్టాక్స్‌ 3-7 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి. మిగిలినవి కూడా 3 శాతం వరకు నష్టాలను భరిస్తున్నాయి. అదే సమయానికి నిఫ్టీలోని మొత్తం 15 సెక్టోరియల్‌ ఇండీస్‌ ట్రేడవుతున్నాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.