Stock Market Closing 11 September 2023: 


భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తొలిసారి 20,000 మార్క్‌ను అందుకుంది. చివరి గరిష్ఠమైన 19,991ను అధిగమించేందుకు 36 సెషన్లు పట్టింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందినా.. జీ20 సమావేశాలు ఇచ్చిన కిక్కుతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. మొత్తంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 176 పాయింట్లు పెరిగి 19,996 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 528 పాయింట్లు పెరిగి 67,127 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 83.03 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,598 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,807 వద్ద మొదలైంది. 65,735 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,172 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 528 పాయింట్ల లాభంతో 67,127 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 19,819 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,890 వద్ద ఓపెనైంది. 19,865 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,008 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 176 పాయింట్లు పెరిగి 19,996 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 45,340 వద్ద మొదలైంది. 45,231 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,636 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయత్రం 414 పాయింట్లు ఎగిసి 45,636 వద్ద ముగిసింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 46 కంపెనీలు లాభాల్లో 4 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌ (7.10%), అపోలో హాస్పిటల్స్‌ (2.18%), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (3.68%), యాక్సిస్‌ బ్యాంక్ (2.32%), పవర్‌ గ్రిడ్‌ (2.18%) షేర్లు లాభపడ్డాయి. కోల్‌ ఇండియా (1.15%),  బజాజ్ ఫైనాన్స్‌ (0.28%), ఓఎన్‌జీసీ (0.27%), ఎల్‌టీ (0.18%) షేర్లు నష్టపోయాయి. మీడియా మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ రంగాల షేర్లకు డిమాండ్‌ పెరిగింది.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.59,830 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.23,830 వద్ద ఉంది.


క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?


క్రితం రోజు 66,265 వద్ద మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం 66,381 వద్ద మొదలైంది. 66,299 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 12 గంటల ప్రాంతంలో పుంజుకున్న సూచీల 66,766 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకొంది. చివరికి 333 పాయింట్ల లాభంతో 66,598 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,774 వద్ద మొదలై 19,727 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకొంది. మధ్యాహ్నం 19,867 వద్ద గరిష్ఠాన్ని అందుకొన్న సూచీ మొత్తంగా 92 పాయింట్లు ఎగిసి 19,819 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 278 పాయింట్లు పెరిగి 45,156 వద్ద ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.