Q2 Results: ఆర్థిక రంగంలోని యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సంర సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2FY23) లాభాల వృద్ధిని సాధించాయి.
Union Bank Q2 Results
రెండో త్రైమాసికంలో... యూనియన్ బ్యాంక్ రూ. 1,848 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ మిగుల్చుకున్న రూ. 1,526 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. రికవరీలు పెరగడం, ఆస్తుల నాణ్యత మెరుగుపడటం, మార్జిన్‌లలో వృద్ధి వల్ల లాభం పెరిగింది.
మొత్తం ఆదాయం గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ. 20,683 కోట్ల నుంచి ఇప్పుడు రూ. 22,857 కోట్లకు పెరిగింది.
నికర వడ్డీ ఆదాయం YoY ప్రాతిపదికన 21.61 శాతం వృద్ధి చెంది రూ. 8,305 కోట్లు మిగిలింది. నికర వడ్డీ మార్జిన్‌లోనూ 20 బేసిస్ పాయింట్ల వృద్ధితో 3.15 శాతాన్ని బ్యాంక్ సాధించింది.
ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. ఇచ్చిన మొత్తం అప్పుల్లో స్థూల నిరర్థక ఆస్తులు (GNPAs) రూ. 65,391 కోట్లకు తగ్గాయి. ఏడాది కాలంలో ఇవి 12.64 శాతం నుంచి 4.19 శాతం తగ్గి 8.45 శాతానికి చేరాయి. నికర నిరర్ధక ఆస్తులు (NNPAs) 1.97 శాతం తగ్గి 2.64 శాతానికి దిగి వచ్చాయి. వీటి విలువ రూ. 19,193 కోట్లు.
నికర వడ్డీ ఆదాయం (NII) 21.61 శాతం వృద్ధితో రూ. 8,305 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (NIM) 2.95 శాతం నుంచి 3.15 శాతానికి పెరిగింది.
Canara Bank Q2 Results
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కెనరా బ్యాంక్ రూ. 2,525 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ. 1,333 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 89 శాతం వృద్ధి. మొత్తం ఆదాయం గతేడాది రూ. 21,331.49 కోట్ల నుంచి రూ.24,932.19 కోట్లకు (YoY) పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ పేర్కొంది.
నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 6,273 కోట్ల నుంచి 18.54 శాతం (YoY) వృద్ధితో పెరిగి రూ. 7,434 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (NIM) 2.73 శాతం నుంచి 2.83 శాతానికి పెరిగింది. నిర్వహణ లాభం (ఆపరేటింగ్ ప్రాఫిట్) 23 శాతం పెరిగి రూ. 6,905 కోట్లకు చేరింది.
స్థూల నిరర్థక ఆస్తులు (GNPAs) గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోని 8.42 శాతం నుంచి ఇప్పుడు 6.37 శాతానికి (YoY) తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తులు (NNPAs) కూడా 3.22 శాతం నుంచి తగ్గి 2.19 శాతానికి పరిమితమయ్యాయి. మొండి బకాయిలు, ఆకస్మిక వ్యయాల కోసం చేసే కేటాయింపులు (Provisions) రూ. 2,678.48 కోట్ల నుంచి రూ. 2,745.03 కోట్లకు పెరిగాయి. కేటాయింపులు పెరగడం ఆందోళనకర విషయం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం రుణ వృద్ధిని సాధిస్తామని కెనరా బ్యాంక్ గెడెన్స్ ఇచ్చింది.
Bajaja Finance Q2 Results
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో, బజాజ్ ఫైనాన్స్ Q2 లాభంలో 88% జంప్‌తో రూ. 2,781 కోట్లకు చేరుకుంది. ఈ NBFC చరిత్రలో ఇది అత్యధిక త్రైమాసిక లాభం. ఈ కంపెనీ రూ. 2,638 కోట్ల లాభాన్ని సాధించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
Q2లో, నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) 31% పెరిగి రూ. 218,366 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ ఆదాయం 31% పెరిగి రూ. 7,001 కోట్లకు చేరుకుంది.
సెప్టెంబరు చివరి నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు, నికర నిరర్ధర ఆస్తులు వరుసగా 0.24%, 0.11%గా ఉన్నాయి. క్రితం సంవత్సరం ఇదే కాలంలో ఇవి 0.39%, 0.24%గా ఉన్నాయి.సెప్టెంబర్ త్రైమాసికంలో బుక్ చేసిన కొత్త రుణాలు గత సంవత్సరం ఇదే త్రైమాసికంలోని 6.33 మిలియన్ల నుంచి 7% వృద్ధితో 6.76 మిలియన్లకు పెరిగాయి.
రుణ నష్టాలు, కేటాయింపులు రూ.1,300 కోట్ల నుంచి రూ.734 కోట్లకు (YoY) తగ్గాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.