Adani Ports Stocks: అదానీ పోర్ట్స్ (Adani Ports Special Economic Zone - APSEZ) షేర్లు కొత్త గరిష్టాన్ని తాకాయి. ఇవాళ (సోమవారం) ఇంట్రా డే ట్రేడింగ్‌లో, 3 శాతం పైగా పెరిగి రూ.939.95 వద్ద రికార్డ్ స్థాయిని (52 వారాల గరిష్టం) చేరాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Q1FY23) జూన్ త్రైమాసికంలో ప్రకటించిన బలమైన ఆదాయాలు, మెరుగైన బిజినెస్ ఔట్‌లుక్ కారణంగా అదే రేంజ్ ఫలితాలను Q2లోనూ ప్రకటిస్తుందన్న ఆశతో ఇన్వెస్టర్లు అదానీ పోర్ట్స్ షేర్లను ఎగబడి కొంటున్నారు. ఈ నేపథ్యంలో, గత వారం రోజుల్లో ఈ కౌంటర్ 10 శాతం లాభపడింది. గత నెల రోజుల్లో 19 శాతం పెరిగింది. ఇదే నెల రోజుల్లో BSE సెన్సెక్స్ 1 శాతం పెరిగింది.
గత ఆరు నెలల్లో ఈ స్టాక్ 29 శాతం, గత ఒక ఏడాదిలో 26 శాతం లాభపడింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) చూస్తే, 28 శాతం వరకు గెయిన్స్‌లో ఉంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లోని గరిష్ట స్థాయి నుంచి దాదాపు పడిపోయి, జూన్‌లో రూ.651.95 కనిష్ట స్థాయికి (52 వారాల కనిష్టం) పడిపోయిన ఈ స్టాక్, Q1FY23 (ఏప్రిల్ - జూన్ త్రైమాసికం) ఫలితాల నుంచి అనూహ్యంగా పుంజుకుంది. 'V' షేప్‌లో 43 శాతం రికవర్ అయి, ప్రస్తుత స్థాయికి తిరిగి వచ్చింది.
రికార్డ్ త్రైమాసికం
రికార్డ్ స్థాయి కార్గో సైజ్, హయ్యస్ట్ త్రైమాసిక ఎబిటా (EBITDA)తో APSEZ చరిత్రలోనే Q1FY23 అత్యంత బలమైన త్రైమాసికంగా నిలిచింది. పోర్ట్స్ & లాజిస్టిక్స్ వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయ వృద్ధి మద్దతుతో, ఈ కంపెనీ రికార్డు స్థాయిలో రూ.3,005 కోట్ల ఎబిటాను తొలి త్రైమాసికంలో నివేదించింది.
టెక్నికల్ వ్యూ
బయాస్: పాజిటివ్
సపోర్ట్: రూ.912
టార్గెట్ : రూ.970
జూన్‌లోని కనిష్ట స్థాయి నుంచి ఇప్పటివరకు 43 శాతం పైగా పుంజుకున్న ఈ స్టాక్, వీక్లీ ఛార్ట్‌లో బొలింజర్ బ్యాండ్ హయ్యర్ ఎండ్ దగ్గర ట్రేడవుతోంది.
డైలీ ఛార్ట్ ప్రకారం చూస్తే, గత రెండు ట్రేడింగ్ సెషన్లలో బోలింగర్ బ్యాండ్ హై ఎండ్‌ను బ్రేక్ చేసి ఆ పైన కదులుతోంది. ఈ స్ట్రిప్ రూ.912 కంటే పైన ఉన్నంత కాలం స్వల్పకాలిక బయాస్ బుల్లిష్‌గా ఉంటుందని దీని అర్ధం. అయితే ర్యాలీకి తాజా బలం తోడవ్వాలంటే మాత్రం రూ.923 కంటే పైన నిలబదొక్కుకోవాలని వీక్లీ చార్ట్ సూచిస్తోంది.
అప్‌సైడ్‌లో, రూ.970 స్థాయి వరకు ఈ నేమ్ ర్యాలీ చేయగలదని మంత్లీ ఫిబొనాసీ చార్ట్‌ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు, రూ.912 స్థాయి కంటే పైన నిలదొక్కుకోవడంలో విఫలమైతే, రూ.880 స్థాయి వరకు కరెక్షన్‌ను అవకాశం వస్తుంది. ఈ స్టాక్‌కు రూ.850 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తోంది, ఇది దాని 20-DMA.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.