Fortune Global 500 List: ఫార్చూన్‌ 500 గ్లోబల్‌ కంపెనీల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీ (Reliance Industry) తన ర్యాంకు మరింత మెరుగు పర్చుకుంది. గతేడాదితో పోలిస్తే 51 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంకుకు చేరుకుంది. 2021లో రిలయన్స్‌ 155వ స్థానంలో ఉండేది.


మొత్తంగా భారత్‌ నుంచి 9 కంపెనీలు ఫార్చూన్‌ 500 గ్లోబల్‌ జాబితాలో చోటు సంపాదించాయి. ప్రైవేటు రంగం నుంచి నాలుగు, ప్రభుత్వ రంగం నుంచి ఐదు కంపెనీలు ఉన్నాయి. భారతీయ జీవిత బీమా కంపెనీ (LIC) తాజాగా ఈ జాబితాలో అరంగేట్రం చేసింది. రిలయన్స్‌ కన్నా మెరుగైన 98వ ర్యాంకు సాధించింది. ఎల్‌ఐసీ రూ.5 లక్షల కోట్ల విలువతో ఈ ఏడాదే ఐపీవోకు వచ్చిన సంగతి తెలిసిందే.


ఫార్చూన్‌ 500 కంపెనీల జాబితాలో రిలయన్స్‌ వరుసగా 19 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. భారత్‌లోని ఇతర ప్రైవేటు కంపెనీలతో పోలిస్తే సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రికార్డు రిలయన్స్‌దే. టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలూ తాజా జాబితాలో స్థానం సంపాదించాయి. 2022, మార్చి 31కి ముందు ఆర్థిక ఏడాదిలో కంపెనీల రాబడిని బట్టి ఫార్చూన్‌ 500 కంపెనీలకు ర్యాంకింగ్స్‌ ఇస్తారు.


Also Records: ఇవాళ బంగారం భారీ షాక్! ఒకేసారి ఎగబాకిపోయిన రేటు, వెండి ఎంత పెరిగిందంటే


Also Records: రూపాయి ఢమాల్‌! సెన్సెక్స్‌, నిఫ్టీది మాత్రం దూకుడే!


 FY22లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయం రూ.792,756 కోట్లుగా నమోదైంది. 47 శాతం పెరిగింది. ఎబిటా ఆదాయం వార్షిక ప్రాతిపదికన 28.8 శాతం పెరిగి రూ.125,687 కోట్లుగా ఉంది. ఓ2సీ, రిటైల్‌, డిజిటల్‌ సర్వీసు వ్యాపారాల ఆదాయం జీవిత కాల గరిష్ఠానికి చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది కంపెనీ మార్కెట్‌ విలువ సైతం రూ.20 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం.  ఈ రికార్డును సాధించాలని రిలయన్స్ ఎన్నాళ్లుగానో ఎదురు చూడటం గమనార్హం.


ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ 142, ఆయిల్‌ అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ONGC) 190 ర్యాంకుల్లో ఉన్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా 236, భారత్‌ పెట్రోలియం 295 స్థానాలో నిలిచాయి.