Stock Market Closing Bell 03 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలే కనిపించడంతో సూచీలు ఆద్యంతం ఒడుదొడుకులకు లోనయ్యాయి. ప్రాంతీయ రాజకీయ ఆందోళన వల్ల కొన్ని షేర్లలో అమ్మకాలు కనిపించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 42 పాయింట్ల లాభంతో 17,388 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 214 పాయింట్ల లాభంతో 58,350 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 45 పైసలు నష్టపోయి 79.16 వద్ద క్లోజైంది.


BSE Sensex


క్రితం సెషన్లో 58,136 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,174 వద్ద మొదలైంది. 57,788 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,415 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 214 పాయింట్ల లాభంతో 58,350 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 17,345 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,349 వద్ద ఓపెనైంది. 17,225 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,407 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 42 పాయింట్ల లాభంతో 17,388 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 37,954 వద్ద మొదలైంది. 37,692 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,068 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 34 పాయింట్ల లాభంతో 37,989 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ముగిశాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ, టైటాన్‌, టీసీఎస్‌, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడ్డాయి. సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌, కొటక్‌ బ్యాంక్‌, మారుతీ, కోల్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి. ఐటీ సూచీ 1.35 శాతం వరకు ఎగిసింది. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, ఫార్మా సూచీలు ఎరుపెక్కాయి.