అత్యంత సంపన్నుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ చిక్కుల్లో పడ్డారు! కుళ్లిన కోడిగుడ్లతో అతడి నౌకపై దాడి చేసేందుకు నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్‌ ప్రజలు సిద్ధమవుతున్నారు. అతడి కోసం నిర్మిస్తున్న ఓ భారీ నౌక కోసం చారిత్రక రోటర్‌డ్యామ్‌ను తొలగించాల్సి రావడమే ఇందుకు కారణం.


ఈ మధ్య కాలంలో సొంతగా నౌకలను కొనుగోలు చేయడం ప్యాషన్‌గా మారింది.  సాధారణంగా కుబేరులు తమ సొంతంగా నౌకలను తయారు చేయించుకుంటున్నారు. జెఫ్‌ బెజోస్ సైతం ఇదే బాటలో నడిచారు. అతడి కోసం సముద్ర జలాల్లో సుదీర్ఘ ప్రయాణం చేసే 417 అడుగుల సూపర్‌ యాచ్‌ను సిద్ధం అవుతోంది. నెదర్లాండ్స్‌ ఓసియాన్కోకు చెందిన అల్‌బ్లాసర్‌డ్యామ్‌ కంపెనీ దీనిని నిర్మిస్తోంది. ఇందుకోసం 500 మిలియన్‌ డాలర్ల వరకు తీసుకుంటోంది.


బెజోస్‌ నౌక సముద్రంలో ప్రవేశించాలంటే సుప్రసిద్ధ రోటర్‌డ్యామ్‌ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ లిఫ్ట్‌బ్రిడ్జ్‌ డ్యామ్‌కు డీ హెఫ్‌ అనే పేరుంది. దీని ఎత్తు 130 ఫీట్లు. ఇందులోంచి 417 అడుగుల ఎత్తున్న బెజోస్‌ నౌక వెళ్లడం కష్టం. అందుకే  ఆ నౌక కోసం రోటర్‌ డ్యామ్‌ మధ్య భాగాన్ని తొలగించాల్సి వస్తోంది. స్థానిక ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇచ్చింది. దీనిని అయ్యే ఖర్చంతా బెజోసే భరించనున్నారు. నగర అభివృద్ధికి ఇలాంటి ఆర్డర్లు ఎంతో అవసరమని స్థానిక ప్రభుత్వం భావిస్తోంది.


చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన రోటర్‌డ్యామ్‌ తొలగించడాన్ని కొందరు స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. 'జెఫ్‌ బెజోస్‌ సూపర్‌ యాచ్‌పై కోడిగుడ్లు విసరడం' అనే ఈవెంట్‌ను ఫేస్‌బుక్‌లో ప్లాన్‌ చేశారు. 'రోటర్‌డ్యామర్స్‌కు పిలుపు! మీతో పాటు ఒక డబ్బా కుళ్లిపోయిన కోడిగుడ్లు తీసుకురండి. జెఫ్‌ బెజోస్‌ సూపర్‌ యాచ్‌ ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు కోడిగుడ్లు విసురుదాం' అని దానికి డిస్‌క్రిప్షన్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు 1200 మంది ఈవెంట్‌కు వస్తామని బదులిచ్చారు. దాదాపుగా 5000 వరకు ఆసక్తి ప్రదర్శించారు. జూన్‌ 1న ఈ ఈవెంట్‌ జరగనుంది. మరి ప్రభుత్వం, బెజోస్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.


Also Read: Tata Steel Q3 Net Profit: టాటా స్టీల్‌! ఉక్కు కన్నా గట్టిగానే లాభాలు!


Also Read: Tata Nexon EV: అదిరిపోయే కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు.. లాంచ్ త్వరలోనే.. ఒక్కచార్జ్‌తో 500 కిలోమీటర్లు!