'తను నేను' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ శోభన్ ఆ తరువాత 'పేపర్ బాయ్' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. రీసెంట్ గా అతడు నటించిన 'ఏక్ మినీ కథ' ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమానే 'ప్రేమ్ కుమార్'.
మొన్నామధ్య విడుదల చేసిన సినిమా ఫస్ట్ గ్లింప్స్ బాగా వైరల్ అయింది. పీకే అనే కుర్రాడు.. తను కోరుకున్నట్లుగా ఉండే వధువు కోసం భూతద్దం పట్టుకొని వెతకడం.. అమ్మాయి దొరికిన తరువాత పెళ్లి వరకు వెళ్తే.. ఆమె లేచిపోవడం వంటి ఫన్నీ సన్నివేశాలతో సినిమాను రూపొందించారు. ఇప్పుడు సినిమా నుంచి 'నీలాంబరం' అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు.
రెండు రోజుల క్రితం ఈ పాట పాడిన సింగర్ అనురాగ్ కులకర్ణి ఫ్రస్ట్రేట్ అవుతూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. తన పాట బాగుందని టీమ్ నుంచి అందరూ ఫోన్లు చేసి పొగుడుతున్నారని.. కానీ పాటను మాత్రం రిలీజ్ చేయడం లేదని ఆవేదన చెందుతూ ఓ వీడియోను వదిలాడు. అది ప్రమోషన్ కోసమే అనే విషయం క్లియర్ గా తెలుస్తుంది. ఫైనల్ గా ఈ రొమాంటిక్ సాంగ్ బయటకొచ్చింది.
అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్ సరసన రాశి సింగ్ హీరోయిన్‌గా నటించింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.