దేశంలోనే అతిపెద్ద ఐపీవోకు వేగంగా అడుగులు పడుతున్నాయి. భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) ఐపీవో ముసాయిదా పత్రాలను నవంబర్లో సెబీ వద్ద దాఖలు చేస్తారని తెలిసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు ఈ విషయం బయటకు వెల్లడించారు.
Also Read: రెడ్‌మీ కొత్త టీవీల సేల్ నేడే.. రూ.16 వేలలోపే!
'ఈ ఆర్థిక ఏడాదిలోనే ఎల్‌ఐసీ ఐపీవోను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తుది గడువు, టైమ్‌లైన్‌ను నిర్దేశించుకున్నాం. నవంబర్లో డీఆర్‌హెచ్‌పీని సెబీకి సమర్పిస్తాం' అని ఆ అధికారి పేర్కొన్నారు.
Also Read: ఐదేళ్ల క్రితం లక్ష పెడితే ఇప్పుడు 40 లక్షల లాభం! ఆ షేర్ ఏంటో తెలుసా?
ఎల్‌ఐసీ ఐపీవో కోసం ప్రభుత్వం గత నెల్లో పది మంది మర్చంట్ బ్యాంకర్లను నియమించింది. గోల్డ్‌మన్ సాచెస్ (ఇండియా) సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నొమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎస్‌బీఐ క్యాపిటల్స్ మార్కెట్స్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కొటక్ మహీంద్రా క్యాపిటల్‌నూ ఎంపిక చేశారు.
Also Read: కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల కుటుంబాలకు బిగ్ రిలీఫ్
ఐపీవో ముసాయిదా సమర్పించగానే మర్చంట్ బ్యాంకర్లు జనవరిలోపు పెట్టుబడిదారులతో జాతీయ, అంతర్జాతీయ సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే ఐపీవో కోసం సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్‌ను న్యాయ సలహాదారుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏదేమైనా మార్చిలోపు ఈ ప్రక్రియ పూర్తికావాలని కేంద్రం పట్టుదలతో ఉంది. స్టాక్‌మార్కెట్‌కు వెళ్లే ముందు ఎల్‌ఐసీ విలువను గణించేందుకు ఆక్చురియల్ సంస్థ మిల్లిమన్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పీని నియమించింది. మొత్తం ఈ ఐపీవో ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: ఈ షేరులో లక్ష పెట్టుంటే ఆరు నెలల్లో రూ.9.41 లక్షలు చేతికొచ్చేది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి