రతన్‌ ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌ మదుపర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఆరు నెలల్లో ఈ స్టాక్‌ 841 శాతం రాబడి ఇచ్చింది. 2021, ఏప్రిల్‌ 30న రూ.4.95గా ఉన్న ఈ షేరు ధర సెప్టెంబర్‌ 30 నాటికి రూ.46.6కు చేరుకుంది. అంటే ఏప్రిల్‌లో లక్ష రూపాయాలు ఇందులో పెట్టుబడి పెట్టుంటే నేటికి ఇప్పుడు రూ.9.41 లక్షలు వచ్చుండేవి!


Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం


ప్రస్తుతం ఈ షేరు 5, 100, 200 రోజుల మూవింగ్‌ యావరెజెస్‌ మించే ట్రేడ్‌ అవుతోంది. అయితే 20, 50 రోజుల మూవింగ్‌ యావరెజెస్‌కు దిగువన ఉంది. ఒక్క ఏడాదిలోనే 653 శాతం పెరిగిన ఈ షేరు ఈ ఏడాది ఆరంభం నుంచి 548 శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం సంస్థ విలువ రూ.6,054 కోట్లుగా ఉంది.


Also Read: వరుసగా రెండు రోజులు తగ్గి ఈ రోజు షాకిచ్చిన బంగారం, ఫాలో ఫాలో యూ అన్న వెండి


2021, జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీలో నలుగురు ప్రమోటర్ల వాటా 74.75 శాతంగా ఉండగా పబ్లిక్‌ షేర్‌ హోల్డర్లకు 25 శాతం వాటా ఉంది. ఈ షేరు ధర మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్నా ఆర్థిక నివేదికలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ అమ్మకాలు కేవలం కోటి రూపాయలే కావడం గమనార్హం. అయినప్పటికీ పోటీదారులను తోసిరాజని షేరు ధర పెరుగుతోంది. ఇదే సమయంలో అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేరు 57, ఎన్‌టీపీసీ 30, పవర్‌గ్రిడ్‌ కార్ప్‌ 18 శాతమే పెరిగింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ స్టాక్‌ ధర మాత్రం ఆరు నెలల్లోనే 328 శాతం ఎగిసింది.


Also Watch: దేశంలో టాప్-10 కుబేరులు వీరే, ఆస్తుల వివరాలు ఇలా


నోట్‌: స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. షేర్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణులు సలహాలు తీసుకోవడం అవసరం! ప్రస్తుతం అందిస్తోన్న మార్కెట్ల సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫలానా స్టాక్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ చెప్పడం లేదు.


Also Read: అమెజాన్‌లో అక్టోబర్‌ 2న వీటిపై డిస్కౌంట్లు.. మీ విష్‌లిస్టులో ఉంటే కొనేయండి!


Also Watch: పెట్రోల్ బైక్ Vs ఎలక్ట్రిక్ బైక్.. వీటిలో ఏది బెస్ట్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి