2021 అక్టోబరు 2 శనివారం బంగారం, వెండి ధరలు
గత కొన్ని రోజులుగా స్పల్పంగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పు చోటుచేసుకుంది. బంగారం ధరలు భారీగా పెరిగాయి. శనివారం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు రూ.980 వరకు పెరిగింది. ఉదయం ఆరు గంటల వరకూ ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు చూద్దాం.
దేశంలో ప్రధాన నగరాల్లో శనివారం ధరల వివరాలు:
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,920 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,910
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,470 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,470
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 , 24 క్యారెట్ల ధర రూ.47,350
వెండి ధరలు: కిలో వెండిపై దాదాపు రూ.1200 వరకు పెరిగింది. శనివారం దేశీయంగా ప్రధాన ప్రాంతాలలో వెండి ధరలు చూస్తే...ఢిల్లీలో కిలో వెండి రూ.59,500, చెన్నైలో రూ.63,700, ముంబైలో కిలో వెండి రూ.59,500, కోల్‌కతాలో రూ.59,500, బెంగళూరులో కిలో వెండి రూ.59,500, కేరళలో రూ.63,700, హైదరాబాద్, విజయవాడ విశాఖ పట్టణంలో కిలో వెండి ధర రూ.63,700 ఉంది.
దీపావళినాటికి ధర భారీగా పెరిగే అవకాశం: అయితే బంగారం, వెండి ధరల్లో నిత్యం స్వల్ప హెచ్చుతగ్గులున్నా దిపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఏకంగా పది గ్రాముల బంగారం రూ.57 వేల నుంచి రూ.60 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న రేట్లపై దాదాపు పదివేలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వెండి ధరలు కూడా బంగారం ధరలనే ఫాలో అవుతాయంటున్నారు.
వివిధ అంశాలపై పసిడి ధర: బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Also Read: కరోనాపై పోరాటంలో మరో ముందడుగు.. కొవిడ్19 యాంటీవైరల్ మెడిసిన్ రెడీ.. అద్భుతమైన ఫలితాలు
Also Read: ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...
Also Read: ఇల్లు శుభ్రం చేశాక చీపురుని ఇలా పెడితే దరిద్రమట..మీకు తెలుసా..