LIC Holdings: ప్రభుత్వ రంగ 'లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌' (LIC), మన దేశంలో అతి పెద్ద దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్‌ (DII). దలాల్‌ స్ట్రీట్‌లోని ప్రతి మూలలో ఈ సంస్థ పెట్టుబడులు, ముద్ర కనిపిస్తాయి. LIC పోర్ట్‌ఫోలియోలో దాదాపు 273 స్టాక్స్‌ కనిపిస్తాయి. వాటి ప్రస్తుత విలువ దాదాపు రూ. 10 లక్షల కోట్లు.


2023 క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటి వరకు (YTD), LIC కిట్టీలోని 12 స్టాక్స్‌ కనీసం 20% రాబడి అందించాయి. అవి.. RVNL, కిర్లోస్కర్ ఎలక్ట్రిక్, అరబిందో ఫార్మా, వెల్‌స్పన్‌ ఇండియా, రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా, ITC, ఆయిల్ ఇండియా, సిమెన్స్, టాటా మోటార్స్, Rites, ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సాఫ్ట్‌వేర్‌ (OFFS).


2023లో ఇప్పటివరకు దాదాపు 30% ర్యాలీ చేసిన ITC స్టాక్, లిస్టెడ్ స్పేస్‌లో LIC రెండో అతి పెద్ద బెట్‌. మార్చి త్రైమాసికంలో, ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఈ స్టాక్‌లో తన వాటాను స్వల్పంగా 2 బేసిస్ పాయింట్లు తగ్గించుకుని 15.27%కి చేర్చింది. 


మార్కెట్ విలువ ప్రకారం భారతదేశపు అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), LIC అతి పెద్ద బెట్‌. దీనిలో LIC పెట్టుబడి విలువ రూ. 1.06 లక్షల కోట్లు. అయితే, RIL స్టాక్‌ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ప్రతికూల రాబడిని ఇచ్చింది.


IT మేజర్‌ TCS దాదాపు రూ. 52,600 కోట్లతో LIC మూడో అతి పెద్ద హోల్డింగ్‌గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో SBI (రూ. 44,500 కోట్లు), ICICI బ్యాంక్ (రూ. 40,000 కోట్లు), L&T (రూ. 38,000 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ. 38,000 కోట్లు),
IDBI బ్యాంక్ (రూ. 29,000 కోట్లు), HDFC (రూ. 24,000 కోట్లు), కోటక్ మహీంద్రా బ్యాంక్ (రూ. 24,000 కోట్లు) ఉన్నాయి.


2023లో ఎల్‌ఐసీకి అధిక లాభాలు అందించిన 12 స్టాక్స్‌:


 స్టాక్‌ పేరు: RVNL
YTD లాభం: 73%
LIC హోల్డింగ్‌: 6.38%


స్టాక్‌ పేరు: కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ 
YTD లాభం: 64%
LIC హోల్డింగ్‌: 1.26%


స్టాక్‌ పేరు: అరబిందో ఫార్మా
YTD లాభం: 41%
LIC హోల్డింగ్‌: 5.57%


స్టాక్‌ పేరు: వెల్‌స్పన్‌ ఇండియా
YTD లాభం: 31%
LIC హోల్డింగ్‌: 3.74%


స్టాక్‌ పేరు: రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ 
YTD లాభం: 28%
LIC హోల్డింగ్‌: 3.56%


స్టాక్‌ పేరు: గ్లెన్‌మార్క్ ఫార్మా
YTD లాభం: 28%
LIC హోల్డింగ్‌: 2.93%


స్టాక్‌ పేరు: ITC
YTD లాభం: 28%
LIC హోల్డింగ్‌: 15.27%


స్టాక్‌ పేరు: ఆయిల్ ఇండియా
YTD లాభం: 24%
LIC హోల్డింగ్‌: 11.31%


స్టాక్‌ పేరు: సిమెన్స్
YTD లాభం: 24%
LIC హోల్డింగ్‌: 2.63%


స్టాక్‌ పేరు: టాటా మోటార్స్
YTD లాభం: 24%
LIC హోల్డింగ్‌: 5.21%


స్టాక్‌ పేరు: Rites
YTD లాభం: 22%
LIC హోల్డింగ్‌: 8.15%


స్టాక్‌ పేరు: OFFS
YTD లాభం: 20%
LIC హోల్డింగ్‌: 3.82%


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.