Latest Gold-Silver Prices 05 September 2024: యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను చాలా తక్కువ మొత్తంలో కట్‌ చేస్తుందని పెట్టుబడిదార్లు భావిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు రెండు వారాల కనిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,532 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వెండి రేటు కూడా ₹ 90,000 వద్ద స్థిరంగా ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)


తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 72,760 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 66,690 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,560 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 90,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 72,760 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 66,690 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,560 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 90,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 


చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం (1 గ్రాము) ధర ఇవాళ ₹ 6,669 గా ఉండగా, 24 క్యారెట్ల ధర ₹ 7,276 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర ₹ 6,669 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 7,276 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం (1 గ్రాము) ధర ₹ 6,684 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 7,291 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం (1 గ్రాము) ధర ₹ 6,669 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 7,276 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం (1 గ్రాము) ధర ₹ 6,669 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 7,276 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం (1 గ్రాము) ధర ₹ 6,669 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 7,276 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.


ప్లాటినం ధర (Today's Platinum Rate)


మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 140 పెరిగి ₹ 24,540 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.


పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.


మరో ఆసక్తికర కథనం: