Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీ, జున్నుల మిత్ర మనీషాల పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. తన తల్లిని తీసుకొస్తే తన తండ్రి మిత్ర పెళ్లి చేసుకోడని లక్కీ జున్నుతో చెప్తుంది. ఫ్యామిలీ ట్రీలో లక్ష్మీ ప్లేస్‌లో తన ఫొటో మనీషా పెట్టడం చూసిన లక్కీ ఆ విషయం జున్నుతో చెప్తుంది. ఇంట్లో వాళ్ల ఎవరూ తన తల్లి గురించి చెప్పడం లేదని, స్టోర్‌రూంలోకి వెళ్లి అక్కడ వెతికితే తల్లి గురించ తెలుస్తుందని లక్కీ, జున్ను అనుకుంటారు. తన తల్లి ఎవరో తెలిస్తే పెళ్లి ఆపొచ్చని స్టోర్ రూం వెతకడానికి ఇంటికి వెళ్తారు. ఇక లక్ష్మీ మనీషా దగ్గరున్న అరవింద వీడియో తీసుకురావాలని అనుకుంటుంది. దేవయాని మనీషా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది.
దేవయాని: ఏంటి మనీషా మిత్రకు అలా ప్రామిస్ చేశావ్. మాట మీద నిలబడుదామనేనా.
జాను: అక్క మనీషా ఆ వీడియో ఇస్తుందా.
లక్ష్మీ: ఈ పెళ్లి గురించే కదా మనీషా కలలు కనింది.
మనీషా: ఆంటీ మీరు నన్ను జడ్జ్ చేయలేకపోతున్నారా.
జాను: అక్క ఆ మనీషా మాట మీద నిలబడే రకం కాదు.
లక్ష్మీ: మర్యాదగా వీడియో అడిగి చూస్తాను ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను.
దేవయాని: ఏమో మనీషా నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో నాకు తెలీదు.
మనీషా: ఈ పెళ్లి అవ్వగానే నేను ఏం చేస్తానో తెలుసా. ఆ వీడియో పోలీసులకు ఇచ్చి అరవింద ఆంటీని పోలీసులకు పట్టిస్తాను.( లక్ష్మీ మాటలు విని షాక్ అయిపోతుంది) ఆంటీ వెళ్లగానే అంకుల్ మంచాన పడతారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఇద్దరు చెరో దిక్కు అయిపోతే మిత్ర నా చేతిలో కీలు బొమ్మ అవుతాడు. నేను చెప్పినట్లే విని నాతో ఫారెన్‌కు వచ్చేస్తాడు. అక్కడ మేం ఇద్దరమే ఉంటాం.
దేవయాని: మరి లక్కీ.
మనీషా: మేం వెళ్లిపోతే ఆస్తి మొత్తం నీదే కదా ఆంటీ. ఆస్తితో పాటు ఆ దరిద్రాన్ని కూడా మీరే ఉంచుకోండి.
దేవయాని: ఛీఛీ ఆ దరిద్రం నాకు ఎందుకు ఏ అనాథ ఆశ్రమంలో వదిలేస్తాను. అంతా ఓకే కానీ మనం ఇదంతా చేస్తే ఆ లక్ష్మీ ఊరుకుంటుందా. అయినా నీకు దక్కాల్సింది నీకు నాకు దక్కాల్సింది నాకు దక్కిన తర్వాత ఆ లక్కీ, లక్ష్మీ ఏమైతే మనకు ఏంటి.
ఇక లక్కీ, లక్ష్మీ ఇద్దరూ దేవయాని ఎదుట పడతారు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ఇంటికి వెళ్తున్నాం అని మనీషా ఆంటీ కోసం గిఫ్ట్ తీసుకొస్తామని చెప్తారు. దేవయాని వెళ్లనిస్తుంది. ఇక మిత్ర పెళ్లి పీటల మీద ఉంటూ లక్ష్మీ గురించే ఆలోచిస్తాడు. సంయుక్త మాటలు తలచుకుంటాడు. మిగతా వాళ్లు కూడా డల్‌గా మండపంలో ఉంటారు. మండపం మీదకు లక్ష్మీ వస్తున్నట్లు ఊహించుకుంటాడు. అందరూ మిత్ర లక్ష్మీని గుర్తు చేసుకుంటున్నాడని అనుకుంటారు. మిత్ర మనసు మారే అవకాశం ఉందని వెళ్లి మాట్లాడమని అరవింద తన భర్త, వివేక్‌ని పంపిస్తుంది. ఇద్దరూ మిత్ర దగ్గరకు వెళ్లి లక్ష్మీ గుర్తొస్తుందా నువ్వు చేస్తుంది తప్పు ఈ పెళ్లి ఆపు అని చెప్తారు. మిత్ర మాత్రం మనీషాకు మాట ఇచ్చానని, లక్కీని కన్న బిడ్డగా చూసుకుంటానని అందని చెప్తాడు. లక్ష్మీ పెళ్లి ఆపడం లేదు మిత్ర కూడా ఒప్పుకోవడం లేదని ఇక ఆ దేవుడే పెళ్లి ఆపాలని అనుకుంటారు.
లక్ష్మీ మనీషా దగ్గరకు వెళ్తుంది. వీడియో అడుగుతుంది. మనీషా పెళ్లి అయిన తర్వాత ఇస్తాను అని చెప్తుంది. దాంతో లక్ష్మీ మనీషా, దేవయాని మాటలు విన్నానని నువ్వు అనుకున్నవి ఏవీ జరగనివ్వనని బతకాలి అనకుంటే వీడియో ఇచ్చేయ్ మని చెప్తుంది. పెళ్లి తర్వాతే వీడియో ఇస్తానని ఏం చేయాలి అనుకుంటే అది చేసుకో అని మనీషా అంటుంది. ఇంతలో దేవయాని వచ్చి పంతులు పిలుస్తున్నారని మనీషాని తీసుకెళ్తుంది. మనీషా వెళ్లి మిత్ర పక్కన కూర్చొంటుంది. మిత్ర లక్ష్మీని చూస్తాడు. అది మనీషా చూస్తుంది. దేవయానిని పిలిచి మిత్ర లక్ష్మీని చూస్తుందని చెప్పి టెన్షన్ పడుతుంది. తొందరగా తాళి కట్టించమని పంతులికి దేవయాని చెప్తుంది.
మరోవైపు లక్కీ, జున్నులు ఇంటికి వెళ్లి స్టోర్ రూం వెతుకుతారు. జున్నుకి ఓ ఫొటో దొరుకుతుంది. దానికి దుమ్ము పట్టి ఉంటే ఇద్దరూ మొత్తం తుడుస్తారు. ఇద్దరూ ఫొటో చూసి షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: నిద్రపోతున్న క్రిష్‌తో మనసులో మాటలు చెప్పి కంగుతిన్న సత్య.. విడాకులు ఇచ్చేదేలేదట..!