Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ ఎందుకు పిక్నిక్‌ వెళ్లడానికి ఒప్పుకున్నాడు. అసలు ఏం జరగబోతుంది. ఒకసారి మాయ దర్పణంలో చూద్దామని గుప్త దర్పణం తీసుకుని చూసి షాక్‌ అవుతాడు. అలా జరిగితే కథ మొత్తం మొదటికి వస్తుందని బాధపడుతుంటాడు. ఇంతలో ఆరు వస్తుంది. ఎంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూనే మాయా దర్పణం అంటూ ఓపెన్‌ చేయబోతుంటే గుప్త గట్టిగా అరుస్తాడు. దీంతో ఆరు ఉలిక్కిపడుతుంది. అద్దంలో ఏం చూశారని అడుగుతుంది. మీ గురించి చూడటానికే ఉన్నానా? అనగానే మీ దొంగ చూపుల్లోనే ఏదో ఉంది. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా ప్రమాదం జరిగితే నేను నీతో మాట్లాడను అంటుంది.


గుప్త: నీవు వెంటనే వెళ్లి నీ కుటుంబం బయటకు వెళ్లకుండా ఆపు..


ఆరు: ఎందుకు?


గుప్త: ఇది ప్రశ్నలు అడిగే సమయం కాదు బాలిక. వెళ్లి త్వరగా వాళ్లను వెళ్లకుండా ఆపు..


ఆరు: పాపం గుప్తగారు పిల్లలు పిక్నిక్‌ వెళ్లాలనుకుంటున్నారు.


 అనగానే ఈరోజు వాళ్లు బయటకు వెళితే ప్రమాదం. తర్వాత నువ్వు ఆత్మగా ఉన్నన్ని రోజులు బాధపడాల్సి వస్తుంది. అని గుప్త చెప్పి వెళ్లిపోతాడు. ఆరు ఆలోచిస్తుంది. మరోవైపు అమర్‌ రెడీ అవుతుంటే మిస్సమ్మ తదేకంగా చూస్తుంది. అమర్‌ వెళ్లిపోతాడు. ఇంతలో ఆరు రూంలోకి వస్తుంది. వెంటనే మిస్సమ్మ వేసిన డోర్‌ వేసినట్టే ఉంది. మీరెలా లోపలికి వచ్చారేంటి అని డౌట్‌గా అడుగుతుంది.


ఆరు: అయ్యో మిస్సమ్మకు ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడెలా?


మిస్సమ్మ: నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి?


ఆరు: ఏం లేదు మిస్సమ్మ ఏం లేదు..


మిస్సమ్మ: సరే ఇప్పుడు చెప్పండి ఎలా లోపలికి వచ్చారు..?


ఆరు: డోర్‌ లోంచి..


మిస్సమ్మ: అదే అక్కా వేసిన డోర్‌ లోంచి ఎలా వచ్చారు.


  అని మిస్సమ్మ అడగ్గానే డోర్‌ ఒక్కటే వేశావు తీసుకుని వచ్చాను అంటుంది. అంటుంది ఆరు. దీంతో ఏంటో అక్కా ఆయన ఏదేదో చేస్తుంటే నేను ఏం చేస్తున్నానో మర్చిపోతున్నాను. అంటూ మెలికలు తిరిగుతుంది. దీంతో ఆరు షాక్‌ అయి తర్వాత పిక్నిక్‌ కు వెళ్లకండి అని చెప్తుంది. ఎలాగైనా పిక్నిక్‌ క్యాన్సిల్‌ చేయాలని ఆరు ప్రయత్నిస్తుంది. కానీ టైం అయిపోతుందని.. ఆరును బయటకు పంపిస్తుంది మిస్సమ్మ. ఆరు, గుప్త దగ్గరకు పరుగెడుతుంది. మిస్సమ్మ పిక్నిక్‌‌ కు అంతా రెడీ చేస్తుంటుంది. ఇంతలో శివరాం, నిర్మల మోడ్రన్‌ గా రెడీ అయి వస్తారు. వాళ్లను చూసిన రాథోడ్‌ షాక్‌ అవుతాడు.


అమర్: ఏయ్‌ రాథోడ్‌ ఏమైంది.


రాథోడ్‌: ఏంటి సార్‌ ఆ గెట్టప్పులు..


శివరాం: మరి పిక్నిక్‌‌ కు వెళ్తున్నాం కదా రాథోడ్‌ ఈ మాత్రం లేకపోతే ఎలా.. అందుకే ఇలా సెట్‌ చేశా.


రాథోడ్‌: అమ్మో మీ ఆనందం కోసం ఎదుటోడి ప్రాణం పోయినా పర్వాలేదా?


శివరాం: ప్యాషన్‌ తెలియని బూచోడితో మాట్లాడటమే వేస్ట్‌.. ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉన్నాయి మా గెటప్స్‌


నిర్మల: మీరైనా ఈ పడుచు పిల్లాడికి చెప్పండి నాన్నా.. ఆయన వేసుకున్నదే కాకుండా నన్ను కూడా వేసుకోమని ఒకటే గొడవ. ఈయన గొడవ కంటే వేసుకోవడమే బెటర్‌ అనుకుని వేసుకున్నాను.


మిస్సమ్మ: లేదు అత్తయ్యా మామయ్య చెప్పింది కరెక్టే..


 అని భాగీ ఇద్దరినీ సమర్థిస్తుంది. మరోవైపు గుప్త దగ్గరకు వెళ్లిన ఆరు. మిస్సమ్మకు ఎంత చెప్పినా వినడం లేదని చెప్తుంది. దీంతో గుప్త కంగారుగా టెన్షన్‌ పడుతుంటే అసలు ఆ మాయా పెట్టెలో ఏముందని అడుగుతుంది. ఇంతలో గుప్త ఆ మనోహరి వీళ్లందరూ బయటకు వెళ్లకుండా ఏదో ఒకటి చేస్తుంది కదా? చూద్దాం అనుకుని కిటికి దగ్గరకు వెళ్తాడు గుప్త. లోపల పిల్లలు పై నుంచి కిందకు వస్తుంటే మనోహరి వాళ్లను తోసేయ్యబోయి కింద పడుతుంది.  దీంతో అమర్‌ పిక్నిక్‌ క్యాన్సిల్‌ అని మనోహరిని హాస్పిటల్‌ కు తీసుకెళ్లబోతుంటే రాథోడ్‌ అడ్డుపడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: దావూదీ... దావూదీ... ఎన్టీఆర్ 'దేవర'లో దుమ్ము రేపే వీడియో సాంగ్ వచ్చిందోచ్