Jio Cloud PC App Turns Smart TV Into Computer: రిలయన్స్ జియో తన కొత్త ఆవిష్కరణతో టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. ఇకపై.. మీ ఇంట్లో, ఆఫీస్‌లో, షాప్‌లో ఉన్న స్మార్ట్ టీవీని కంప్యూటర్‌గా మార్చుకోవడం చాలా సులభం. జియో లాంచ్‌ చేసిన "జియో క్లౌడ్ పీసీ" అనే కొత్త యాప్‌తో మీ స్మార్ట్‌ టీవీని కంప్యూటర్‌గా మార్చుకున్నాక, కంప్యూటర్‌తో చేయగల అన్ని పనులు దీనిలో చేసుకోవచ్చు. ఇ-మెయిల్‌ చెక్ చేయవచ్చు, సోషల్ మీడియాను బ్రౌజ్ చేయవచ్చు, ఇంటర్నెట్‌లో సర్ఫ్ చేయవచ్చు, సినిమాలు చూడొచ్చు.


యాప్‌ ఎలా పని చేస్తుంది?
జియో క్లౌడ్ పీసీ యాప్‌ను మీ స్మార్ట్ టీవీలో ఇన్‌స్టాల్ చేసి, కీబోర్డ్ & మౌస్‌ను కనెక్ట్ చేయండి. అంతే, మీ టీవీ ఇప్పుడు ఒక పూర్తి స్థాయి కంప్యూటర్‌గా మారిపోతుంది. ఈ యాప్ క్లౌడ్-బేస్డ్‌గా పని చేస్తుంది. కాబట్టి, మీ డేటా అంతా సురక్షితంగా క్లౌడ్‌లో స్టోర్‌ అవుతుంది.


జియో క్లౌడ్ పీసీతో ప్రయోజనాలు
సౌలభ్యం: కంప్యూటర్ కొనుగోలు చేయకుండానే, మీ ఇంటిలోనే కంప్యూటర్‌ను ఉపయోగించే అవకాశం.
తక్కువ ధర: కంప్యూటర్ కొనుగోలు చేయడం కంటే చాలా తక్కువ ఖర్చుతో ఈ సేవను పొందొచ్చు.
ఒకే ఖర్చుతో రెండు డివైజ్‌లు: టీవీ & కంప్యూటర్‌ను విడివిడిగా కొనకుండా, ఒకే ఖర్చుతో రెండింటినీ వినియోగించుకోవచ్చు. 
సురక్షితం: మీ డేటా అంతా క్లౌడ్‌లో సురక్షితంగా ఉంటుంది.
ఒకే దెబ్బకు చాలా పిట్టలు: ఇంటర్నెట్ సర్ఫింగ్, వర్డ్ ప్రాసెసింగ్, ఇ-మెయిలింగ్‌, సోషల్ మీడియా వంటి అన్ని రకాల పనులను చేయొచ్చు.
స్మార్ట్‌ ఫోన్‌లో: జియో క్లౌడ్ పీసీ యాప్‌ను స్మార్ట్‌ ఫోన్‌లో కూడా ఇన్‌స్టాల్‌ చేసుకుని, వినియోగించుకోవచ్చు. 


ఎవరికి ఉపయోగపడుతుంది?
విద్యార్థులు: ఆన్‌లైన్ క్లాసులు వినడానికి, హోంవర్క్ చేయడానికి.
ఉద్యోగులు: ఇంటి నుండి పని చేయడానికి (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌).
సీనియర్ సిటిజన్స్: ఇంటర్నెట్‌తో కాలక్షేపం చేయడానికి, కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడానికి.
అందరికీ: సరదాగా గేమ్స్ ఆడడానికి, వీడియోలు, సినిమాలు చూడడానికి.


మరో ఆసక్తికర కథనం: సేవింగ్స్‌ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు, ఎంత టాక్స్‌ కట్టాలి? 


యాప్‌ను ఎక్కడి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి?             
ఈ యాప్‌ను ప్రజల కోసం ఇంకా లాంచ్‌ చేయలేదు. ఎప్పుడు లాంచ్‌ చేస్తారు, ఎంత ధర చెల్లించాలన్న విషయాలను జియో వెల్లడించలేదు.          


జియో క్లౌడ్ పీసీ టెక్నాలజీ ప్రజలందరికీ, ముఖ్యంగా పేద & మధ్య తరగతి కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, టెక్నాలజీని ప్రతి ఇంటిలోకి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని జియో చెబుతోంది.            


గమనిక: క్లౌడ్ పీసీ యాప్ గురించి ఒక ప్రాథమిక అవగాహన అందించడంమే ఈ వార్త ఉద్దేశ్యం. మరింత సమాచారం కోసం జియో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.         


మరో ఆసక్తికర కథనం: మీ PF అకౌంట్‌లో పుట్టినతేదీ తప్పుగా ఉంటే దానిని సరిచేయడం చాలా సింపుల్‌