Unclaimed Amount in Banks: బ్యాంకుల దగ్గర పోగు పడిన అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ రూ. 5,729 కోట్లు. బ్యాంకులు గత ఐదేళ్లలో సేవింగ్స్ అంకౌంట్, ఎఫ్‌డీల ద్వారా సేకరించిన దాదాపు 5 వేల కోట్ల రూపాయల కంటే ఇదే ఎక్కువ మొత్తం. బ్యాంకులు ఈ డబ్బును వాటి సొంతదార్లకు అప్పగించే పనిలో ఉన్నాయి.
క్లెయిమ్ చేయని డిపాజిట్లను డిస్పాచ్ చేసేందుకు, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్ నుంచి గత 5 సంవత్సరాలుగా మొత్తం 5,729 కోట్ల రూపాయలు బ్యాంకులకు బదిలీ అయ్యాయి.
క్లెయిమ్ చేయని డబ్బు అంటే ఏమిటి?
పొదుపు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను 10 సంవత్సరాలకు మించి ఉపయోగించకుండా ఉంటే, అలాంటి ఖాతాను ఇన్‌యాక్టివ్ డిపాజిట్‌గా బ్యాంక్ పరిగణిస్తుంది. ఆ ఖాతాలోని డబ్బును DEA ఫండ్‌లో జమ చేస్తుంది. ఈ ఫండ్‌ను రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తుంది.
మార్చి 31, 2023 నాటికి, రూ. 36,185 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ మొత్తాలను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు ప్రభుత్వ రంగ బ్యాంకులు బదిలీ చేశాయి. 2019 మార్చిలో ఈ మొత్తం రూ. 15,090 కోట్లు. మార్చి 31, 2023 నాటికి ప్రైవేట్ బ్యాంకులు రూ. 6,087 కోట్లను DEA ఫండ్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాయి.
'100 డేస్ 100 పేస్' క్యాంపెయిన్
ఇలా పోగుపడిన 'క్లెయిమ్ చేయని మొత్తానికి' నిజమైన యజమానికి వెతికి పట్టుకుని, ఆ డబ్బును సెటిల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఒక స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. దాని పేరు.. '100 డేస్ 100 పేస్' (100 Days 100 Pays campaign). ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. భారతదేశంలోని ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి బ్యాంకులో, క్లెయిమ్ చేయని డబ్బున్న తొలి 100 ఖాతాలను గుర్తించి, 100 రోజుల లోపు ఆ డబ్బును అసలు యజమాన్లకు అప్పగించాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది.
క్లెయిమ్ చేయని డిపాజిట్ల లిస్ట్‌లో మీ పేరు ఉందో, లేదో ఎలా చెక్ చేయాలి?
మీ బ్యాంక్ అకౌంట్ లేదా మీ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలో డబ్బు క్లెయిమ్ చేయకుండా అలాగే ఉంటే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సేవింగ్స్ ఖాతా లేదా FD ఖాతాలో జమ చేసిన అన్‌క్లెయిమ్డ్ మనీని సులభంగా క్లెయిమ్ చేయవచ్చు.
మీరు PNB కస్టమర్ అయితే, www.pnbindia.in/inoperactive-accounts.aspx లింక్ ద్వారా వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అవసరమైన ఇన్ఫర్మేషన్‌ను ఆ పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా మీ పేరు ఉందో, లేదో తెలుసుకోవచ్చు.
మీరు HDFC కస్టమర్ అయితే leads.hdfcbank.com/applications/webforms/apply/HDFC_Inoperative_acc/HDFC_Inoperative_acc.aspx లింక్ ద్వారా చెక్ చేయవచ్చు.
SBI కస్టమర్లు sbi.co.in/web/customer-care/inoperative-accounts లింక్ ద్వారా మీ అర్హతను తనిఖీ చేయవచ్చు.
క్లెయిమ్ చేయని మొత్తాన్ని నామినీ ఎలా తీసుకోవచ్చు?
ఖాతాలోని అన్‌క్లెయిమ్డ్ మొత్తాన్ని నామినీ తీసుకోవాలంటే, నామినీ వ్యక్తిగత గుర్తింపు రుజువును చూపించాలి. దీంతోపాటు, ఖాతాదారు మరణ ధ్రువీకరణ పత్రం సహా కొన్ని అవసరమైన పత్రాలను కూడా సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత, బ్యాంకులో సంబంధిత ఫారాన్ని నింపాలి. మీ అభ్యర్థనను బ్యాంక్ పరిశీలిస్తుంది. బ్యాంక్ సంతృప్తి చెందితే, క్లెయిమ్ చేయని మొత్తాన్ని నామినీకి ఇస్తుంది.
మరో ఆసక్తికర కథనం: రోజుకు ₹75 దాస్తే చాలు, మీ కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం వెతుకునే అవసరం ఉండదు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial