Patanjali Gulab Sharbath: పతంజలి గులాబ్ షర్బత్ (Rose Syrup) భారతీయ పానీయాల మార్కెట్‌లో కొత్త బజ్ క్రియేట్ చేసింది.  మార్కెట్‌లో లీడింగ్ షర్బత్‌లకు పోటీగా నిలిచింది. ఇది కేవలం రుచి, తాజాదనంకు మాత్రమే కాదని తమ షర్బత్‌లో ఆయుర్వేద గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని పతంజలి చెబుతోంది . పతంజలి ఆయుర్వేదకు చెందిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పరిశ్రమలో దీనిని రూపొందిస్తున్నారు. సాంప్రదాయ మిశ్రమాలను ఆధునిక సాంకేతికతతో ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు.

ఈ సిరప్ ఎలా తయారు చేస్తున్నారంటే..

ఈ షర్బత్‌ను మార్కెట్‌లో విడుదల చేసిన పతంజలి, తమ ట్రేడ్‌మార్క్ ప్రొడక్టును ఎలా తయారు చేస్తారో వివరించింది. ఈ మిశ్రమం కోసం.. గ్రామాల్లో ఆర్గానిక్‌గా పండించిన గులాబీ రెమ్మలను ఉపయోగిస్తారు. గులాబీ రేకులతో పాటు, రోజ్ వాటర్, కొద్దిగా షుగర్ ను ఈ షెర్బత్ తయారీలో వినియోగిస్తారు.  రైతల నుంచి సేకరించిన గులాబీ రేకులను ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లలో కడుగుతారు. ఆ తర్వాత స్టీమ్ డిస్టలేషన్ విధానంలో రోజ్ వాటర్ తయారు చేస్తారు. దీనివల్ల గులాబీ రేకుల్లోని సహజ గుణాలు చెడిపోకుండా ఉంటాయి. పంచదారను ముదురుపాకంగా చేసి రోజ్‌ వాటర్ తో కలుపుతారు. వీటికి యాలకుల మిశ్రమాన్ని జతచేస్తారు. ఫిల్టర్ మెషీన్ల ద్వారా వ్యక్థాలను తొలిగిస్తారు. ఈ మొత్తం మిశ్రమాన్ని స్టెయిన్‌లెస్‌  స్టీల్ ట్యాంకులలోకి వడకట్టి అవసరం లేని మిశ్రమాన్ని వేరు చేస్తారు.

పతంజలి ఈ ద్రావకం మొత్తం సహజమైనదే అని చెబుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ ద్రావకాన్ని నిల్వ చేయడానికి పాశ్చరైజేషన్ చేయాల్సి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ తర్వాత మిశ్రమాన్ని ఆటోమేటిక్ ఫిల్లింగ్ యంత్రాల ద్వారా ఫుడ్ గ్రేడ్ బాటిళ్లలో నింపుతారు. ఇన్ని ప్రక్రియలు పూర్తైన తర్వాతే అవి లేబిలింగ్‌కు వెళతాయి. పతంజలి కి చెందిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పరిశ్రమలో ఎక్కువుగా ఆటోమేటెడ్ యంత్రాల ద్వారా పనులు నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయడం కోసం కన్వేయర్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు.ప్రతి బ్యాచ్ బాటిళ్లను చాలా సమర్థమవంతమైన క్వాలిటీ చెక్ చేస్తారు. PH స్థాయిలు, Brix మీటర్స్ నిరంతరం పరిశీలిస్తారు.

ఈ ద్రావకం ఆరోగ్య ప్రదాయణి

తమ ఉత్పత్తులు కేవలం వాణిజ్య ప్రధానంగా తయారు చేయడం లేదని.. ప్రజలను ఆరోగ్యాన్ని కలిగించే ఉత్పత్తులనే మార్కెట్‌కు తెస్తున్నామని పతంజలి వాగ్దానం చేస్తుంటుంది. ఇప్పుడు ఈ సిరప్ కూడా డైజేషన్, ఆరోగ్య సంరక్షణ, చర్మ సౌందర్యం, మానసిక ప్రశాంతతకు ఉపకరిస్తుందని చెబుతోంది. ఈ ప్రొడక్ట్‌ను భారత్‌తో పాటు, యుఎస్, యూరోప్, ఆఫ్రికా మార్కెట్‌లో కూడా విక్రయిస్తున్నారు. పతంజలి సంస్థ మెగా ఫుడ్ పార్క్, స్థానిక రైతులను గులాబీ సాగులో ప్రోత్సహిస్తోంది