Infosys Narayana Murthys Daughter Akshata Richer Than Queen Of Britain Report : ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణ మూర్తి కుమార్తె, బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సనక్‌ సతీమణి అక్షతా మూర్తి ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు. బ్రిటిష్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ కన్నా సంపన్నురాలిగా మారారు. ఏఎఫ్‌పీ రిపోర్టు ప్రకారం అక్షిత వ్యక్తిగత సంపద విలువ బిలియన్‌ డాలర్లకు మించి ఉండగా ఎలిజబెత్‌ సంపద 350 మిలియన్‌ పౌండ్లు (460 మిలియన్‌ డాలర్లు) మాత్రమే. ఇంతకీ ఇదెలా సాధ్యమైందంటే?


Also Read: కార్డుల్లేకుండానే బ్యాంకులు, ఏటీఎంల్లో క్యాష్‌ విత్‌డ్రా! UPI ఐడీతో అద్భుతాలు!


బ్రిటన్‌ పౌరసత్వం ఉన్న రిషి సనక్‌ను అక్షత 2009లో పెళ్లాడారు. వీరిద్దరూ అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌లో చదువుకొనేటప్పుడే ప్రేమించుకున్నారు. రిషిని భవిష్యత్తు బ్రిటన్‌ ప్రధానిగా భావిస్తున్నారు. అయితే ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఆయనపై ఒత్తిడి ఉంది. స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌కు కంపెనీ రిపోర్టు చేసిన సమాచారం ప్రకారం 42 ఏళ్ల అక్షతకు ఇన్ఫోసిస్‌లో బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు ఉన్నాయి. బ్రిటన్‌ పౌండ్లలో చూసుకుంటే దాదాపు 76,81,49,500 విలువ ఉంటుంది. ఇది బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ వ్యక్తిగత సంపద 350 మిలియన్‌ పౌండ్ల కన్నా ఎంతో ఎక్కువ.


Also Read: ఏప్రిల్‌లోనే ఇలా టాక్స్‌ ప్లానింగ్‌ చేయండి! లక్షల్లో డబ్బు మిగులుతుంది!


రిషి, అక్షత దంపతులకు నాలుగు ఆస్తులు ఉన్నాయి. లండన్‌లోని అప్‌స్కేల్‌ కెన్సింగ్‌టన్‌లో ఐదు పడకల ఇళ్లు ఉంది. దీని విలువ 7 మిలియన్‌ పౌండ్లుగా అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలోనూ ఒక ఫ్లాట్‌ ఉంది. 2013లో స్థాపించిన కాటామారన్‌ వెంచర్స్‌లోనూ డైరెక్టర్‌గా ఉన్నారు. కాగా ఆమెపై బ్రిటన్‌ టాక్సు వివాదాలు ఉన్నాయి. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే బ్రిటన్‌ బయట ఉన్న ఆస్తులు, సంపాదన బ్రిటన్‌ పన్ను పరిధిలోకి రాదని అక్షత వాదిస్తున్నారు. ఇన్ఫోసిస్‌ రాబడిపై పన్ను ఇక్కడ కట్టడం సాధ్యం కాదని చెబుతున్నారు.