ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంలో ( New Cabinet ) సభ్యులు ఎవరన్నదానిపై సీఎం జగన్ పార్టీ కోర్ కమిటీతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు.  సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) , విజయసాయిరెడ్డితో ( VijaiSai Reddy ) పాటు మరికొంత మంది ముఖ్య నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సామాజిక సమీకరణాలు, అనుభవం వంటి వాటిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని కొత్త కేబినెట్ కూర్పును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా మంత్రుల జాబితాను ఇంకా గవర్నర్‌కు ( Governer ) పంపలేదు. శనివారమే జాబితాను గర్నరర్‌కు పంపే అవకాశం ఉంది. అయితే ఈ జాబితాను బహిరంగంగా ప్రకటిస్తారా లేకపోతే..కాబోయే మంత్రులకే నేరుగా ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారా అన్నదానిపై  క్లారిటీ లేదు. 


ప్రతిపక్షనేతగా చంద్రబాబు సెట్ అవ్వరు - వైసీపీ ఎంపీలకు కనకమేడల చురకలు


ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలో ( YSRCP ) మంత్రి పదవుల కోసం పోీట తీవ్రంగా ఉంది. అసంతృప్తి స్వరాలు ఎక్కువగా వినిపించే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా కొంత మందిని బుజ్జగించేందుకు వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.  సీనియర్ మంత్రులు కూడా తమ పదవుల్ని తీసేయడంపై అసంతృప్తిగా ఉన్నారని... ఎవరికి వారు రాజకీయం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తమను కొనసాగించాలని మంత్రులు వివిధ మార్గాల్లో సీఎం జగన్‌పై ( CM Jagan ) ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటితో వైఎస్ఆర్‌సీపీలో కొత్త మంత్రులు ఎవరన్నదానిపై ఉత్కంఠ ప్రారంభమయింది.


రాష్ట్రమంతా వాలంటీర్లకు అవార్డులు, ప్రశంసలు - నెల్లూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్


సీఎం జగన్ ముందుగా వంద శాతం మంత్రుల్ని మార్చాలని ఆలోచన చేశారు. కానీ బ్యాలెన్స్ కుదరదని భావించి...  అనుభవం, సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుని కొంత మందిని కొనసాగించాలని నిర్ణయించారు . ఈ విషయాన్ని సీఎం జగన్ మంత్రివర్గ సహచరులకు చెప్పారు. దీంతో అందరూ మానసికంగా సిద్ధమయ్యారు. రాజీనామా పత్రాలు అడిగిన వెంటనే  ఇచ్చేశారు. కానీ పదవి నిలబెట్టుకునేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. 


ఏప్రిల్ 11న మంత్రుల ప్రమాణ స్వీకారం ఇక్కడే! ఏర్పాట్లు షురూ చేసిన అధికారులు


కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం.. ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రి ఉండేలా చూడటం కూడా కొన్ని సమీకరణాల్ని మార్చేలా చేస్తోంది. చాలా మంది జగన్మోహన్ రెడ్డితో పాటు మొదటి నుంచి నడిచిన సీనియర్లు అవకాశం కోసం చూస్తున్నారు. వీరందరికీ పదవులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది.