Stock Market: ఈవారం దేశీయ ఈక్విటీ మార్కె్ట్లు సోమవారం సెలవులో ఉండనున్నాయి. శనివారం స్పెషల్ లైవ్ ట్రేడింగ్ కొనసాగిందిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈవారం మెుదటి రోజు క్లోజ్ అవ్వనున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను పెట్టుబడిదారులకు అందించాయి.


స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు 
స్టాక్ మార్కెట్ మే 20న సోమవారం నాడు సెలవులో ఉండనున్నాయి. దీంతో వారంలో మొదటి రోజు ట్రేడింగ్ ఉండదు. దీనికి కారణం ముంబై మహానగరంలో 5వ విడత పోలింగ్ కింద ముంబై నగరంలో మే 20న పోలింగ్ జరుగుతున్నందున స్టాక్ మార్కెట్లో క్లోజ్ చేయబడనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ సెలవు దినంగా ప్రకటించాయి. ఓటింగ్ దృష్ట్యా స్టాక్ మార్కెట్‌ను మూసి ఉంచారు. అయితే మే 21 మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లు తిరిగి తెరుచుకుంటాయని ఇన్వెస్టర్లకు సమాచారం అందించాయి. 


లోక్‌సభ ఎన్నికలే కారణమా? 
ముంబై మహానగరంలో లోక్‌సభ ఎన్నికల కారణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లు మూతపడనున్నాయి. మే 20న ముంబైలో ఓటింగ్ జరగనుంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులతో పాటు స్టాక్ మార్కెట్ కూడా మూసివేయబడుతుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 25 ప్రకారం ఎన్నికల్లో ప్రజల భాగస్వాములుగా మార్చేందుకు స్టాక్ మార్కెట్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. స్టాక్ మార్కెట్ సోమవారం మూసివేయబడినందున ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, SLB, కరెన్సీ విభాగాల్లో ఎటువంటి ట్రెండింగ్ ఉండబోదని బీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం వెల్లడైంది.  


ముంబైలో లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ కారణంగా మే 20వ తేదీ సోమవారం ట్రేడింగ్‌కు సెలవు ఇస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ సైతం సర్క్యులర్‌ జారీ చేసింది. సెలవుదినం కారణంగా ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌లు, సెక్యూరిటీల లెండింగ్ అండ్ బారోయింగ్ విభాగాల్లో ట్రేడింగ్ ఉండదని తన ప్రకటనలో వెల్లడించింది. సోమవారం స్టాక్ మార్కెట్ సెలవుదినం కారణంగా గత శనివారం ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించబడింది. ఇప్పటికే రెండు శనివారాల్లో ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌ డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో భాగంగా నిర్వహించబడ్డాయి.