రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు తక్కువ ధరకే ఉత్పత్తులను అందజేస్తే దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాలకు సరఫరాను నిలిపివేస్తామని భారతీయ వినియోగ వస్తువుల విక్రయదారులు హెచ్చరిస్తున్నారు. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో మార్ట్‌తో కిరాణాలు భాగస్వాములు కావడంతో గతేడాది తమ విక్రయాలు 20-25 శాతం పడిపోయాయని రెకిట్‌ బెన్‌స్కైర్‌, యూనీలివర్‌, కోల్గేట్‌ పామోలివ్‌ వంటి కంపెనీల విక్రయదారులు వాపోతున్నారు.


విపరీతమైన రాయితీలు ఇస్తుండటంతో ఎక్కువ కిరాణా స్టోర్లు జియోమార్ట్‌ పార్ట్‌నర్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ పద్ధతిలో ఆర్డర్‌ చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న 4.5 లక్షల మందికి పైగా సేల్స్‌మెన్‌కు ముప్పుగా మారింది. వీరంతా దశాబ్దాలుగా నేరుగా కిరాణా దుకాణాల వద్దకు వెళ్లి ఆర్డర్లు తీసుకొని సరకులను పంపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆల్‌ ఇండియా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సమాఖ్య వినియోగ ఉత్పత్తుల తయారీ సంస్థలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. రిలయన్స్‌ తరహాలో తమకూ రాయితీకే అందించాలని కోరుతోంది.


ఒకవేళ ధరల మధ్య సారూప్యత లేకుంటే కిరాణా దుకాణాలకు సరకులను పంపిణీ చేయబోమని సేల్స్‌మెన్‌ హెచ్చరిస్తున్నారు. రిలయన్స్‌తో ఇలాగే భాగస్వామ్యం కొనసాగితే జనవరి 1 తర్వాత కొత్త ఉత్పత్తులను పంపిణీ చేయబోమని తెలిపారు. 'కొన్నేళ్లుగా ఆర్డర్లు తీసుకుంటే రిటైలర్ల వద్ద మేం మంచి పేరు సంపాదించుకున్నాం. వారికి మెరుగైన సేవలు అందిస్తున్నాం. అందుకే మేం సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చాం' అని వారు కన్జూమర్‌ కంపెనీలకు లేఖ రాశారు. 


దేశంలో రిటైల్‌ మార్కెట్లో కిరాణాల ద్వారా 900 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. రిటైల్‌ మార్కెట్లో వీరికి 80 శాతం వాటా ఉంది. అయితే వీరిలో 150 నగరాల్లోని 3 లక్షల కిరాణాలు రిలయన్స్‌ యాప్‌ ద్వారా ఆర్డర్లు ఇస్తున్నాయి. 2024లోపు ఈ సంఖ్యను కోటికి పెంచుకోవాలని రిలయన్స్‌ లక్ష్యం విధించుకుంది.


Also Read: India Post Payment Bank: లిమిట్‌ దాటి డబ్బు జమ చేసినా.. తీసినా.. పోస్టాఫీసులో రుసుము తప్పదు!


Also Read: Stock Market Update: ఈ 100 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ 10-122% పెరిగాయి తెలుసా!


Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్! బంగారం ధర పైపైకి.. వెండి కూడా అంతే.. నేటి తాజా ధరలివీ..


Also Read: Petrol-Diesel Price, 5 December: విశాఖలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర.. ఈ నగరాల్లో మాత్రం తగ్గుదల.. తాజా ధరలు ఇలా..


Also Read: SBI vs HDFC vs ICICI Interest Rates: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలో ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ ఎవరిస్తున్నారో తెలుసా?


Also Read: Rapido: ర్యాపిడోకు తెలంగాణ హైకోర్టు షాక్! ఆ ప్రకటన తక్షణమే నిలిపేయాలని ఆదేశం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి