Global Recession: 'భారత్‌కు మాంద్యం ముప్పు లేదు- రాబోయే రోజుల్లో ఉద్యోగాలే ఉద్యోగాలు'

ABP Desam Updated at: 24 Nov 2022 12:08 PM (IST)
Edited By: Murali Krishna

Global Recession: భారత్.. మాంద్యం గురించి బెంగ పడాల్సిన అవసరం లేదని, రాబోయే సంవత్సరాల్లో ఉపాధి రేటు భారీగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

'భారత్‌కు మాంద్యం ముప్పు లేదు- రాబోయే రోజుల్లో ఉద్యోగాలే ఉద్యోగాలు'

NEXT PREV

Global Recession: ప్రపంచ దేశాలు మాంద్యం (Recession) ముప్పు పొంచి ఉందని భయపడుతున్నాయి. కానీ భారత్‌ (India)లో మాత్రం మాంద్యం ప్రభావం అంతగా ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నియామక ధోరణులు చూస్తే కొన్ని సంవత్సరాలలో భారత్‌ బలమైన ఉపాధి వృద్ధి రేటును చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు బిజినెస్ సర్వీసెస్ ప్రొవైడర్ Quess Corp వ్యవస్థాపకుడు, నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అజిత్ ఐజాక్ తెలిపారు. 



ప్రపంచ దేశాలతో పోలిస్తే మాంద్యానికి భారత్ చాలా దూరంగా ఉంది. భారత్‌లో మనం వృద్ధిని చూస్తూనే ఉంటాం. బహుశా 8% కాదు.. కానీ మేము వృద్ధిని చూస్తాము. 2000, 2007 సంవత్సరాల మధ్య ఉపాధిలో గొప్ప వృద్ధిని చూశాం. దేశ జీడీపీ 2000లో $470 బిలియన్ల నుంచి 2007లో $1.2 ట్రిలియన్లకు పెరిగింది. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే కొన్ని సంవత్సరాలలో అలాంటి వృద్ధి రేటును తిరిగి చూడగలుగుతాం.                                  - అజిత్ ఐజాక్, Quess Corp వ్యవస్థాపకుడు


బెంగళూరులో బుధవారం జరిగిన జాబ్ అన్వేషణ పోర్టల్ మాన్‌స్టర్ ఇండియా, ఎస్‌ఇ ఆసియా, మిడిల్ ఈస్ట్‌ల టాలెంట్ ప్లాట్‌ఫామ్ 'ఫౌండిట్‌' రీబ్రాండింగ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీని ద్వారా ఉద్యోగులు, మేనేజర్‌లను నియమించుకోవడానికి అనేక రకాల సేవలను అందిస్తున్నట్లు ఐజాక్ చెప్పారు.


పలు దేశాల్లో


క్వెస్ కార్ప్.. 2018లో మాన్‌స్టర్ వరల్డ్‌వైడ్ APAC & ME వ్యాపారాలను తన HR సేవల పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక పెట్టుబడిగా కొనుగోలు చేసింది. భారత్, సింగపూర్, మలేషియా, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, వియత్నాం, థాయిలాండ్, ఇండోనేసియా, యూఏఈ, సౌదీ అరేబియాలో ఈ సంస్థ పని చేస్తోంది. 


ఉద్యోగాలు



భారీగా లేఆఫ్‌లు ఎదుర్కొంటున్న టెక్ సెక్టార్, ఇంటర్నెట్ ఎకానమీ మరో రెండు త్రైమాసికాల పాటు ఇదే రీతిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే ఐటీ పరిశ్రమ ప్రత్యక్షంగా 5 మిలియన్ల మందికి, పరోక్షంగా మరో 5 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. కనుక ఐటీ పరిశ్రమ గురించి బెంగ వద్దు. కోర్ సెక్టార్లు ఎక్కువ మందిని నియమించుకుంటున్నాయి. ఇది భారత్‌కు గొప్ప సంకేతం. ఏది ఏమైనప్పటికీ టెక్ సెక్టార్ కూడా దేశంలోని ఉపాధి అవకాశాలను పెంచనుంది. ఎక్కువ కనెక్టివిటీ, డిజిటలైజేషన్, 5G సేవల ద్వారా టెక్ సెక్టార్ ప్రభావితం చేస్తుంది. ఇది ఎక్కువ సంఖ్యలో శ్రామికశక్తిని, ముఖ్యంగా మహిళలు ఇంటి నుంచి పని చేయడానికి.. ఆర్థిక వ్యవస్థను పెంచడానికి వీలు కల్పిస్తుంది.- అజిత్ ఐజాక్, Quess Corp వ్యవస్థాపకుడు


ఇటీవల ఇన్ఫోసిస్, హెచ్‌పీ, విప్రో వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు సహా గూగుల్, మెటా, ఫేస్‌బుక్, ట్విట్టర్.. భారీ సంఖ్యలో లేఆఫ్‌లు (ఉద్యోగాలు తీసేయడం) ఇస్తున్నాయి. దీంతో ఐటీ, టెక్ రంగాల ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 


Also Read: China Covid-19 Cases: చైనాలో కరోనా పంజా- రికార్డ్ స్థాయిలో డైలీ వైరస్ కేసులు!

Published at: 24 Nov 2022 11:58 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.