Karthika Deepam November 24th  Episode 1518 (కార్తీకదీపం నవంబరు 24 ఎపిసోడ్)


కార్తీక్ అనుమానించడాన్ని భరించలేకపోయిన మోనిత..వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదని కన్నీళ్లతో వేడుకుంటుంది
కార్తీక్: అయితే నిజంగా ఆ వంటలకే దుర్గని పంపించింది అంటావు 
మోనిత: అదే నిజం
కార్తీక్: తనపై నీకెందుకు కోపం..తనకు ఏం లాభం
మోనిత: నువ్వు నన్ను అనుమానించి వదిలేస్తే నిన్ను ఆ వంటలక్క సొంతం చేసుకుందామని అలా ప్రయత్నాలు చేస్తోంది 
కార్తీక్: దీప కాదు నువ్వే తనని రెండుసార్లు చంపాలని చూసావు కానీ అలాంటి ప్రయత్నం దీప చేయలేదు తను నాకు గతం గుర్తుకు రావాలని చూస్తోంది ఒకవేళ నేనే నీ భర్తను అయితే ఆ వంటలక్క తన్నుకు పోతుందని ఎందుకు భయపడుతున్నావు
మోనిత: పరాయి ఆడది నా మొగుడి కోసం ఆశపడుతుంటే ఊరికే ఉండాలా 
కార్తీక్: చంపాలి అనుకోవడం తప్పు నీది భయం అయితే తనది నమ్మకం 


Also Read: జగతి-మహేంద్ర కారుకి యాక్సిడెంట్, తండ్రి కోసం ఇంట్లో రిషి ఎదురుచూపులు, టెన్షన్లో గౌతమ్


ఆ తర్వాత సంగారెడ్డి వెళ్లిన దీప..కార్తీక్ ఫొటోకి దండ పడేసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ ఇల్లు ఎవరిది ఇదంతా ఎవరు చేశారు ఎవరు ఇక్కడ డాక్టర్ బాబు ఫోటో ఎందుకు పెట్టారు అనుకుంటుంది. ఇంతలో ఒకామె అక్కడకు వస్తుంది..ఇది నా ఇల్లే రాజ్యలక్ష్మి అమ్మ ఇమ్మంటే ఇచ్చానంటుంది...
దీప: ఎవరు మీరు..డాక్టర్ బాబు ఫోటోకి దండ ఎందుకు వేశారు 
ఆమె ఎవరంటే...( అప్పట్లో కార్తీక్ ఆపరేషన్ చేసినప్పుడు ఓ వ్యక్తి చనిపోవడంతో బాధ్యత వహిస్తూ ఆస్తులన్నీ ఇచ్చేస్తాడు).. ఆ మహిళే ఈమె
ఆ మహిళ: గతంలో డాక్టర్ బాబు నా భర్తకు వైద్యం చేస్తుండగా అనుకోకుండా మరణించారు అప్పుడు డాక్టర్ బాబు ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుని తన ఆస్తిని నా పేరుమీద రాసిన గొప్ప మనసున్న వ్యక్తి అంటూ ఎమోషనల్ అవుతుంది.  కానీ ఆ డాక్టర్ బాబు చనిపోయారంటుంది
దీప: లేదు..డాక్టర్ బాబు చనిపోలేదు..
ఆ మహిళ: డాక్టర్ బాబు బతికే ఉన్నారా..మీరు ఆమె భార్యనా..నాకు చాలా సంతోషంగా ఉంది.. మరి మీరొక్కరూ వచ్చారేంటి
దీప: అవన్నీ తర్వాత చెబుతాను..నా కూతురు ఈ ఊర్లోనే ఉంది అందుకే వచ్చాను
దీప: నీకు కారు-డ్రైవర్ ని అరెంజ్ చేస్తాను...వంట మనిషిని పెడతాను..మీ అమ్మాయిని వెతుక్కునేందుకు సహాయం చేస్తాను


Also Read: శౌర్య అంటించిన పోస్టర్ చూసిన దీప, కార్తీక్ ను కొట్టబోయిన మోనిత!


మోనిత-కార్తీక్: మరొకవైపు మోనిత బయటికి వెళుతుండగా కార్తీక్ ఎక్కడికి అని అడగడంతో మోనిత సంబరపడుతుంది. మన పెళ్లైన కొత్తలో ఇలాగే ఉండేవాడివి కానీ వంటలక్క వచ్చాక మారిపోయావ్ అంటూ మళ్లీ అబద్ధాలు మొదలెడుతుంది. ఏం నాటకాలు ఆడుతున్నావే ఒకవేళ నాకు నిజంగా గతం గుర్తుకు రాకపోయి ఉంటే నువ్వు చెప్పే సోది అంతా వినాల్సి ఉండేదని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత మోనిత షాపింగ్ కి వెళ్లొస్తానని వెళ్లిపోతుంది..


దీప..శౌర్య కోసం ఊరంతా తిరుగుతూ ఉంటుంది. శౌర్య ఫొటో చూపించి కనిపించిన వారందరినీ అడుగుతూ ఉంటుంది.. ఇంతలో శౌర్య అంటించిన పోస్టర్ ఒకటి ఊడి పడిపోయింది కదా అది ఎగిరి దీపపై పడుతుంది. అత్తమ్మ నా నమ్మకమే నిజమయింది నువ్వు ఇదే ఊర్లో ఉన్నావా నాలాగే నువ్వు కూడా మా కోసం వెతుకుతున్నావా అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది దీప.
నువ్వు ఎక్కడ ఉన్నా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను తల్లి అనుకుంటూ ఉంటుంది దీప. ఇంతలోనే దీప ఇంటి ఓనర్ రావడంతో ఆ పోస్టర్ చూపిస్తుంది. అప్పుడు దీప ఆ పోస్టర్లో ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది.


కార్తీక్-దుర్గ: కార్తీక్...దీప గురించి ఆలోచిస్తూ దీప అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో అనుకుంటూ ఉంటాడు. అక్కడకు వచ్చిన దుర్గ.. మోనిత లేదని వెళ్లిపోతుండగా రేయ్ దుర్గ అని పిలుస్తాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ దుర్గతో అబద్ధాలు చెప్పడం ఆపేయ్ దుర్గ నాకు గతం గుర్తుకొచ్చి చాలా రోజులు అయింది అనడంతో దుర్గ షాక్ అవుతాడు. మరి దీపముకు ఎందుకు చెప్పలేదు సార్ అనడంతో నాకు కొంచెం భయం ఉంది... నాకు గతం గుర్తుకు వచ్చింది అని తెలిస్తే మోనిత దీపను ఏమైనా చేస్తుందేమో అన్న భయం అని అంటాడు. అప్పుడు వాళ్లిద్దరూ శౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కార్తీక్..నేను దీపకు అండగా సంగారెడ్డి వెళతాను...నువ్విక్కడ మోనిత సంగతి చూసుకో అని చెబుతాడు...


పోస్టర్లో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసి దీప అక్కడికి వెళుతుంది.  ఇంద్రుడు-శౌర్య పేర్లు చెబుతుంది కానీ అలాంటి వారు ఎవరు ఇక్కడ లేరమ్మా అని చెబుతాడు. అప్పుడు దీప ఇంద్రుడు మళ్ళీ మోసం చేశాడమ్మా నా బిడ్డ నాకు అప్పగించకుండా మాకు కనిపించకుండా ఎక్కడెక్కడో తిప్పుతున్నాడు అని ఎమోషనల్ అవుతుంది...జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది. అప్పుడు ఆమె ఇంటికి వెళ్దాం పద దీప అనడంతో నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని అంటుంది. ఎపిసోడ్ ముగిసింది


రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో 
 ఆనందరావు, సౌందర్య..శౌర్య దగ్గరకు వెళతారు...ఇప్పుడైనా వస్తావా అంటే..అమ్మానాన్నల్ని చూడకుండా నేను రాను రాను అంటుంది...అదే ఊరిలో శౌర్యను వెతుకుతున్న కార్తీక్-దీప ఆ అరుపులు విని ఆ వైపు పరిగెత్తుతారు... అంతా ఓ దగ్గరకు చేరుతారు...